E-Paper
Advertisement

OnePlus 13 Camera Details Leak: వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్.. ఫొటోల క్వాలిటీ మామూలుగా ఉండదు భయ్యా..!

OnePlus 13 Camera Details Leak: వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్.. ఫొటోల క్వాలిటీ మామూలుగా ఉండదు భయ్యా..!
Advertisement

OnePlus 13 specifications and Launch details: భారతీయ మార్కెట్‌లో వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇక ఇప్పటికే పలు మోడళ్లు రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్న వన్‌ప్లస్ ఇప్పుడు మరొక కొత్త మోడళ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘OnePlus 13’ పేరుతో కొత్త మొబైల్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం చివరి నాటికి అధికారికంగా విడుదల చేయబడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన కొన్ని లీక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

దీని వెనుక కెమెరా సరికొత్త డిజైన్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. రాబోయే OnePlus 13 ఫోన్ టెలిఫోటో, అల్ట్రావైడ్ సెన్సార్‌లను 50-మెగాపిక్సెల్‌కి అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. OnePlus 12 మాదిరిగానే రాబోయే ఫోన్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. కెమెరా సెటప్‌లో హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్ ఉంటుందని తెలుస్తోంది.

Also Read: వన్‌ప్లస్ 12 నుంచి మరొక న్యూ కలర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!

Advertisement

OnePlus 13 కెమెరా స్పెసిఫికేషన్స్

OnePlus 13 మూడు 50-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెలిపారు. టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్‌గా ఉంటుందట. అయితే ఈ మూడు కెమెరాలు కూడా OnePlus 12 లో ఉన్నట్లుగానే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ Sony LYT-808 సెన్సార్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది.

OnePlus 13 స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. OnePlus 13 Snapdragon 8 Gen 4 SoCతో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఫోన్ అధికారికంగా వస్తుందని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 6.8-అంగుళాల 2K 8T LTPO డిస్‌ప్లే, అల్ట్రా-సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఇది 100W వైర్డు ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

Tags

Related News

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×