అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు. ఆయన మాట్లాడే మాటలు, చేతలు ఏదో రకంగా వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఇతని వయసు 79 ఏళ్లకు పై మాటే అయినా కూడా దూకుడుగా ఉండడం ఇతని లక్షణం. అయితే డోనాల్డ్ ట్రంప్ కు దీర్ఘకాలికంగా ప్రమాదకరమైన వ్యాధి ఉందని తెలుస్తోంది. దాని పేరు క్రానిక్ వీనస్ డెఫిషియన్సీ అంటే సిరలకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధి.
డబ్బై ఏళ్ల వయసు దాటిన వారికి ఈ వైద్య పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ కాళ్ళపై నిర్వహించిన అల్ట్రా సౌండ్ పరీక్షల్లో ఈ దీర్ఘకాలిక సిరల లోపాన్ని కనిపెట్టారు. అయితే గుండె, మూత్రపిండా వైఫల్యం వంటి సమస్యలు ఏవీ ట్రంప్ కు లేవు. ట్రంప్ పాదాలు ఉబ్బిపోయి, చేతులు, వెనుక భాగంలో గాయాలు వంటివి అవుతూ ఉంటాయని ఆయన ప్రతినిధులు చెబుతున్నారు. తరచుగా ఎవరో ఒకరితే కరచాలనం చేయడం వల్ల ట్రంప్ చేతులకు ఉన్న చిన్న మృదు కణజాలాలకు అలెర్జీ లాంటివి కూడా వస్తాయని వివరిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ ట్రంప్ ఆస్పిరిన్ వాడతారు. అతని గుండెను కాపాడుకోవడానికి వాడే ఆస్పిరిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయని ట్రంప్ ప్రతినిధులు వివరిస్తున్నారు.
79 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్ న్యూ జెర్సీలోని ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు అతను చీలమండల చుట్టూ వాపు కనిపించింది. దాంతో ఆయన ఆరోగ్యం పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన ప్రతినిధులు రంగంలోకి దిగి అతనికున్న ఆరోగ్య సమస్యను వివరించారు.
ఈ దీర్ఘకాలిక సిరల లోపం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాళ్లల్లో ఉండే సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపడంలో ఇబ్బంది పడినప్పుడు ఇలా దీర్ఘకాలిక సిరల లోపం ఏర్పడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం కాళ్లలోని సిరల కవాటాలు బలహీనంగా మారినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు ఈ పరిస్థితి మొదలవుతుంది. దీనివల్ల రక్తం పైకి ప్రవహించకుండా దిగువ భాగాల్లోనే పేరుకు పోతుంది. అప్పుడు కాలంలో వాపు కనిపిస్తుంది.
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే…
కాళ్లల్లో చీలమండలు వంటి ప్రదేశాల్లో నిరంతరం వాపు కనిపిస్తుంది. కాళ్లు బరువుగా అనిపిస్తాయి. తీవ్ర అలసటగా కూడా ఉంటుంది. కాళ్లపై వెరికోస్ వెయిన్స్ కనిపిస్తాయి. అవి ఉబ్బి అంటే రక్తనాళాలు ఉబ్బినట్టు అయ్యి నీలం ఊదా రంగుల్లో వంకర వంకరగా సిరలు కనిపిస్తాయి. పాదాలు, చీలమండల దగ్గర ఉన్న చర్మం కూడా రంగు మారిపోతుంది. అక్కడున్న చర్మం గట్టిగా మందంగా మారుతుంది. పాదాలలో తీవ్రమైన దురద, మంట వస్తాయి. చిన్న గాయం కూడా త్వరగా నయం కాదు. రాత్రి పూట కాలు తిమ్మిర్లు పడతాయి. విశ్రాంతిగా అనిపించదు. నడుస్తున్నప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాడు.