Telangana BJP: బీజేపీలో ఎలెక్టేడ్ పంచాయతీ ముగిసింది. ఇక సెలెక్టెడ్ పంచాయితీ తెర మీదకు వచ్చింది. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు మరో ముసలం ముంచుకొస్తుందా.. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకోవాడికే నానా తంటాలు పడిన కమలం పార్టీ… ఇప్పుడు సెలెక్టెడ్ పదవులను ఎంపిక చేయడంలో ఏం చేయబోతుంది? వచ్చే ముసలాన్ని ఏ విధంగా ఎదురుకోబోతుంది?… కార్యవర్గం ఎంపికలో నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అనుసరించబోతున్న వ్యూహమేంటి? ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో చర్చంతా దీని గురించేనంట.
బీజేపీ రాష్ట్ర సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామచంద్రరావు
బీజేపీ తెలంగాన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును రాష్ట్ర పార్టీ నూతన రథ సారథిగా డిల్లీ పెద్దలు నియమించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలుండగా, బీజేపీ లెక్కల ప్రకారం 38 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకటి రెండు జిల్లాలు మినహాయిస్తే జిల్లాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటిదాకా ఇదంతా బానే జరిగినా.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ముందు ఉన్న సవాళ్ళు.. ప్రతి సవాళ్ళు మాత్రం ముళ్ళ కంచెలా మారాయన్న టాక్ వినిపిస్తోంది.
సెలక్టెడ్ పదవుల్ని ఎలా భర్తీ చేస్తారని చర్చ
అధ్యక్ష పదవుల ఎన్నిక ఒకే కానీ నెక్స్ట్ సెలెక్టెడ్ పదవులైన రాష్ట్ర కార్యవర్గ కూర్పును రామచంద్ర రావు ఏ విధంగా ఎదుర్కుంటారనే చర్చ పార్టీలో స్టార్ట్ అయిందట. ఇప్పటికే జిల్లాల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబందించి నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఇలాంటి తరుణంలో రామ చంద్ర రావు ఇంట గెలిచి బయట గెలవాల్సిన పరిస్థితి. పదవుల పందారం నేపధ్యంలో నేతల మధ్య ముంచుకురానున్న ముసలాన్ని ఆయన ఎదురుకోగలుగుతారా..అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రామచంద్రరావు పార్టీలో ఆధిపత్యపోరుకు చెక్ పెట్టగలరా?
తెలంగాణ బీజేపీ పగ్గాలను రాంచంద్ర రావు చేపట్టారు. అనూహ్యంగా కొత్త సారథిగా బాధ్యతలు దక్కించుకున్న రాంచంద్రరావుకు పార్టీలో అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడం ఆయన ముందున్న అతిపెద్ద సమస్య. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో తెలంగాణలో బీజేపీ చట్ట సభల బలం 21 మందికి చేరింది. 21 మందిలో తాజాగా రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులను, 8 మంది సీనియర్ ఎంపీలను కొత్త అధ్యక్షుడు ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
రాష్ట్ర అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
అంతేకాదు ఎంపీల్లో, ఎమ్మెల్యేల్లో పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురయిన పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి లాంటి నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి రాంచంద్ర రావుకు ఎలాంటి సహకారం అందుతుందనేది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. వీరందరిని సమన్వయం చేసుకోవడం రాంచంద్రరావు ముందున్న అతిపెద్ద సవాల్. కీలక నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో రామ చంద్రరావు ఎలా ముందుకు వెళ్లారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
అసంతృప్తి నేతలు కొత్త అధ్యక్షుడికి సహకరిస్తారా?
ఇక ఒకవైపు ఎలెక్టెడ్ పదవుల ఆధిపత్య పోరు, మరోవైపు ముంచుకొస్తున్న సెలెక్టెడ్ పదవుల పంచాయితీలపై నూతన అధ్యక్షుడి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. అదలా ఉంటే మొన్న జరిగిన సంస్థా గతంగా జరిగిన జిల్లాల అధ్యక్షుల పదవుల కోసం అనేక మంది నేతలు పోటీ పడి, నిరాశకు గురయ్యారు. ఇంకా ఆ అసంతృప్తి సెగలు చల్లారకముందే, ఇప్పుడు సెలెక్టెడ్ పదవుల పంచాయతీ పార్టీలో మరో రచ్చ రేపే అవకాశం కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోందట. సరే ఎలెక్టెడ్ పదవులు దక్కలేదు.. సెలెక్టెడ్ పదవులకైన ఎంపిక చేయాలని నేతలు పట్టుబడుతున్నారట.
సంస్థగత ఎన్నికల షెడ్యూల్‌కి ముంచుకొస్తున్న సమయం
జిల్లా కమిటీలో ఉప అధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులతో పాటు, రాష్ట్ర ఉపాధ్యకులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులు, అధికార ప్రతినిధుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆ క్రమంలో రాష్ట్ర కమిటీలో పదవుల కోసం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. పిల్లికిస్తే ఎలుకకు కోపం, ఎలుకకు ఇస్తే పిల్లికి కోపం అన్నట్టుగా ఉన్న గందరగోళ పరిస్థితిల్లో రామచంద్రరావు అడుగులు ఏ విధంగా ఉంటాయనేది సస్పెన్స్‌గా మారింది. ఎలెక్టెడ్, సెలెక్టెడ్ పదవుల పంచాయితీలు అటుంచుతే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సమయం కూడా ముంచుకొస్తుంది.
Also Read: కూతురిని వేధిస్తున్నాడని.. వెంటాడి వేటాడి..
పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 11 లక్షల మంది సభ్యత్వాలు ఉండగా, తాజాగా జరిగిన సభ్యత్వ నమోదులో 34 లక్షలకు పెంచుకోగలిగారు. అంతేకాదు గతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ ఓటు శాతాన్ని కాపాడుకోవడం ఇప్పుడు పార్టీకి పెద్ద సవాలే అన్న టాక్ వినిపిస్తోంది. ఇట్లాంటి సవాళ్ళున్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాంచంద్రరావుకు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవడం, పార్టీ బలోపేతం చేసుకోవడం వంటి అంశాలు పెద్ద పరీక్షే అంటున్నారు. మరి అంత మంది ఇగోస్‌ని కొత్త బాస్ ఎలా సాటిస్ఫై చేసి కమలం బండిని ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv