BigTV English

Kannappa OTT : ఓటీటీలోకి ‘కన్నప్ప’..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?

Kannappa OTT : ఓటీటీలోకి ‘కన్నప్ప’..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?

Kannappa OTT: టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలోకి రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మహా శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆథారంగా నిర్మించిన చిత్రమే కన్నప్ప. అయితే ఈ మూవీకి ఓటిటి డీల్ జరగకుండానే థియేటర్లోకి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది.. అది ఎంతవరకు నిజమో ఒకసారి తెలుసుకుందాం..


ఓటీటీలోకి ‘కన్నప్ప’..

కన్నప్ప మూవీని ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీకి ఏంటి బిజినెస్ డీల్స్ జరగకుండానే మంచు విష్ణు తన ఓన్ గానే సినిమాను థియేటర్లోకి తీసుకొచ్చాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ని బట్టి బిజినెస్ కూడా మొదలైందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.. కన్నప్ప థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ డీల్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. తాజాగా కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్‌పై అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చింది. జూలై 25 నుంచి కన్నప్ప చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Also Read :వీరమల్లు ప్రమోషన్స్… మరీ ఇంత నీచం ఏంట్రా బాబు..

కన్నప్ప బడ్జెట్ & కలెక్షన్స్..

మంచి స్టోరీతో పాటుగా పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు మోహన్ బాబు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప మూవీకి దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించారు. అయితే దాదాపు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. మంచు విష్ణు మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టాయి.. మొత్తానికి కన్నప్ప కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో 26.98 కోట్ల రూపాయలు.. తమిళంలో 77 లక్షల రూపాయలు, హిందీలో 3.97 కోట్ల రూపాయలు, కన్నడంలో 28 లక్షలు రూపాయలు, మలయాళంలో 73 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా ఇండియా వైడ్ రూ.32.73 కోట్ల నెట్.. 37 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.. ఓవర్సీస్ లో కూడా 5 కోట్లకు పైగానే వసూల్ చేసింది. టోటల్ గా ఇప్పటివరకు 110 కోట్లు వసూల్ చేసిందని టాక్. ఒక మాటలో చెప్పాలంటే కాస్త నష్టాలు తప్పలేదు.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×