E-Paper
Advertisement

ఖాళీ కడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ప్రమాదకరం

ఖాళీ కడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ప్రమాదకరం
Advertisement

చాలా మంది ఉదయం లేచి వెంటనే వేడి వేడి టీతో రోజు ప్రారంభిస్తారు. టీ తాగడం వల్ల ఫ్రెష్‌గా, చురుకుగా అనిపిస్తుంది. కానీ ఖాళీ కడుపున టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. వైద్య నిపుణులు ఈ అలవాటు జీర్ణక్రియ, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల యాసిడిటీ, ప్రేగుల్లో ఇతర సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపున టీ కడుపులో యాసిడిటీని పెంచుతుంది

టీలో కెఫీన్, టానిన్స్ ఉండటం వల్ల కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపు సున్నితంగా ఉంటుంది. స్ట్రాంగ్ టీ.. కడుపు లైనింగ్‌ను చికాకుపెట్టి యాసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. కొందరికి వాంతులు కూడా వస్తాయి.

కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

Advertisement

ఆహారం లేకుండా టీ తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కెఫీన్ శరీరం నుంచి నీటిని ఎక్కువగా వెళ్లగొట్టి డీహైడ్రేషన్ కలిగిస్తుంది. ఇది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోయే అవకాశం ఉంది. కిడ్నీలు సరిగా పని చేయాలంటే తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి

ఉదయం ఖాళీ కడుపున టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ హఠాత్తుగా ఉత్తేజితమవుతుంది. దీంతో సహజ జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కాలక్రమేణా ఆహారం సరిగా జీర్ణం కాదు. నిరంతర యాసిడిటీ కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది.

పోషకాలు సరిగా గ్రహించడానికి అడ్డంకి

Advertisement

టీలో ఉండే టానిన్స్, ఐరన్, కాల్షియం శోషణను తగ్గిస్తాయి. ఖాళీ కడుపున టీ తాగడం వల్ల శరీరం బలహీనంగా, అలసటగా ఉంటుంది. రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఖాళీ కడుపున టీ తాగే అలవాటు మానుకోవాలి.

టీ అలవాటు రోజువారీ జీవితంపై ప్రభావితం

చాలా మంది టీ తాగితేనే ప్రేగులు కదులుతాయని, తాజాగా ఉంటారని అనుకుంటారు. కానీ ఇది అనారోగ్యకరమైన అలవాటు. శరీరానికి సహజంగా ఉదయం వ్యర్థాలను తొలగించే సామర్థ్యం ఉంటుంది. వ్యాయామం, నీళ్లు తాగడం ద్వారా సహజంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Also Read: మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే

ఉదయం టీ బదులు ఇవి తాగడం మంచిది

డాక్టర్లు ఉదయం మొదట నీళ్లు తాగాలని సూచిస్తారు. నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేసి జీర్ణక్రియను పెంచుతాయి. టీ తాగడానికి ముందు పండ్లు, బిస్కెట్లు లేదా తేలికపాటి బ్రేక్‌ఫాస్ట్ తినాలి. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ మంచి ఎంపికలు.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×