Facial With Tomato: సూర్యరశ్మి, కాలుష్యంతో పాటు ఇతర పర్యావరణ కారకాల వల్ల మన చర్మం టాన్ అవుతుంది. ఇది మన రూపాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అకాల వృద్ధాప్యానికి కూడా కారణమవుతుంది. దీని వల్ల ముఖంలోని సహజ మెరుపు దూరమవుతుంది. ట్యాన్ తొలగించడానికి మార్కెట్లో చాలా ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని వాడటం వల్ల అంతగా ఫలితం ఉండదు.
ఇలాంటి సమయంలోనే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నెలకోసారి తప్పనిసరిగా ఫేషియల్ చేయించుకోవాలి. చర్మానికి ఎలాంటి నష్టం జరగకుండా రక్షించడానికి మీరు టమాటో ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా సహజమైనది. అంతే కాకుండా ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటాలతో ఇంట్లోనే సులభంగా ఎలా ఫేషియల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో చర్మానికి ఎందుకు మేలు చేస్తుంది ?
టమాటోలో ఉండే చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు మన చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. ఇది టాన్ లైన్‌లను క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు,
టమాటో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. ఇది మన చర్మంలోని టాన్ ను తొలగించడంలో సహాయపడుతుంది. టమాటోలో విటమిన్-సి, విటమిన్-ఇ, బీటా కెరోటిన్, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది .
అందుకే టానింగ్ తొలగించడంతో పాటు మీ చర్మంపై సహజమైన గ్లో పొందడానికి మీకు కావాలంటే ఇంట్లోనే టమాటోతో ఫేషియల్ చేసుకోవచ్చు. టమాటోతో ఫేషియల్ చేయడం చాలా సులభం.ఇది చర్మానికి ఎటువంటి హాని కలిగించదు కూడా. టమాటో ఫేషియల్ పూర్తిగా సహజమైంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
టమాటో ఫేషియల్ చేసే విధానం:
క్లెన్సింగ్- ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా శుభ్రం చేసుకోండి. రెండు చెంచాల తాజా టమాటో ప్యూరీలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. వేళ్ల సహాయంతో సున్నితంగా మసాజ్ చేసి 8-10 నిమిషాల తర్వాత కాటన్ బాల్‌తో శుభ్రం చేసుకోవాలి.
స్క్రబ్బింగ్- టమాటో ప్యూరీలో కొద్దిగా బియ్యప్పిండిని కలిపి స్క్రబ్‌ను సిద్ధం చేయండి. దీన్ని ముఖంపై 4-5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
మసాజ్ – ఒక చెంచా టమాటో రసంలో ఒక చెంచా పాలను మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. ఇది ముఖంలో రక్త ప్రసరణను పెంచుతుంది .
Also Read: ఈ ఫేస్‌ప్యాక్ ఒక్కసారి వాడినా చాలు.. గ్లోయింగ్ స్కిన్
ఫేస్ ప్యాక్- టమాటో ప్యూరీలో పాలు, కాఫీ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి మీ ముఖం , మెడకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా పార్లర్ కి వెళ్లకుండానే ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.