Samsung Galaxy S25 Slim : సామ్సాంగ్ గెలక్సీ S25 సిరీస్ మొబైల్స్ త్వరలోనే లాంఛ్ కాబోతున్నాయి. ఈ సిరీస్ లో మూడు మొబైల్స్ రాబోతుండగా స్లిమ్ మోడల్ కూడా వచ్చేస్తుందనే వార్తలు ఇప్పటివరకు హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ స్లిమ్ మోడల్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ మొబైల్ మే లో లాంఛ్ కాబోతున్నట్టు సమాచారం.
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సాంగ్ త్వరలోనే సామ్సాంగ్ గెలక్సీ S25 సిరీస్ ను లాంఛ్ చేయబోతోంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ లో భాగంగా.. ఈ సిరీస్ లో గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్, గెలాక్సీ ఎస్25 అల్ట్రా రాబోతున్నాయి. ఈ సిరీస్ లోనే గెలాక్సీ S25 స్లిమ్ కూడా వచ్చేస్తుందనే టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు Galaxy S25 Slim ప్రారంభ లాంఛ్ లో భాగం కాదని చైనీస్ మైక్రోబ్లాగింగ్ యూజర్ సెట్సునా డిజిటల్ వెల్లడించింది.
సామ్సాంగ్ గెలక్సీ S25 సిరీస్ జనవరి 22న గ్రాండ్ గా లాంఛ్ కాబోతుంది కాాగా Samsung Galaxy S25 Slim మెుబైల్ మే లో రాబోతున్నట్లు తెలుస్తుంది. S25 స్లిమ్ సామ్సాంగ్ తీసుకువచ్చిన తాజా One UI 7 బీటా ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Samsung Galaxy S25 Slim ఫీచర్స్ లేటెస్ట్ వెర్షన్ లో రాబోతున్నాయి. 6.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఇప్పుడు, లీక్ అయిన ఫీచర్స్ లో స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25+ వేరియంట్‌కు సమానమైన డిస్ప్లే ప్యానెల్ తో రాబోతుంది. ఈ సిరీస్ మెుబైల్స్ లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ కూడా ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీని సైతం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇక స్లిమ్ మెుబైల్ విషయానికి వస్తే.. Galaxy S25 Slim మోడల్ 4700mAh, 5000mAh మధ్యలో బ్యాటరీని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇందులో కెమెరా సెటప్ సైతం అరిపోయేలా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బహుశా 200MP HP5 ప్రైమరీ షూటర్, 50MP JN5 UW సెకండరీ షూటర్, 50MP JN5 3.5X టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తీసుకువస్తున్నట్లు అంచనా.
ఇక టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ తెలిపినట్లు.. Samsung Galaxy S25 Slim సుమారు 7mm మందంతో ఐఫోన్ 17 ఎయిర్ కంటే కాస్త థిక్ గా ఉండనుంది. అయితే ఈ మొబైల్ డిజైనింగ్ ఇంకా పరిశీలనలోనే ఉండటంతో సాంసంగ్ గెలాక్సీ s25 సిరీస్తో పాటు రాదని కచ్చితంగా తెలుస్తుంది. గ్యాలక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో కేవలం మూడు మొబైల్స్ మాత్రమే లాంచ్ అయ్యి.. 2025 రెండవ త్రైమాసికంలో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
Samsung Galaxy S25 Ultra…. 6.86 అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై ఎండ్ వేరియంట్‌లో 16GB RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రాబోతుంది. ఇది 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్ 50MP టెలిఫోటో షూటర్, 3X జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ALSO READ : చాట్ జీపీటీలో ఇకపై షెడ్యూల్స్, రిమైండర్స్.. ఎలా సెట్ చేయాలంటే!