Ginger Benefits: అల్లంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అల్లం తరుచుగా తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి చాలా మంది అల్లం టీ త్రాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అల్లం టీ ని రుచిని పెంచడంలోనే కాకుండా ఆహారం రుచిని మార్చడంలో కూడా అల్లం అద్భుతాలు చేస్తుంది. అల్లం ఆహార రుచిని మాత్రమే పెంచుతుందనేది అస్సలు నిజం కాదు. అనేక శారీరక సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే అల్లంలో ఔషధ గుణాల నిధి దాగి ఉంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకునే వ్యక్తులు క్రమం తప్పకుండా అల్లం తీసుకుంటే అది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అల్లం రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా కూడా పనిచేస్తుంది.
చలికాలంలో అల్లం తీసుకోవడం మరింత మేలు చేస్తుంది. అల్లం జలుబు ,దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అల్లం తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
శీతాకాలంలో అల్లం తినడం కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి , జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం: అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబు , దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు నొప్పి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
వికారం, వాంతులు తగ్గించడంలో ప్రయోజనాలు: అల్లం వికారం , వాంతులు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో వికారం కీమోథెరపీ వల్ల వచ్చే వికారం తగ్గించడానికి ఉపయోగిస్తారు. అల్లం మెదడులోని వికారం ,వాంతులను నియంత్రించే భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
పెయిన్ రిలీవర్: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కండరాల నొప్పి, తలనొప్పి , ఆర్థరైటిస్ నొప్పికి ఉపయోగించవచ్చు. అల్లంలో ఉండే సమ్మేళనాలు ఇబుప్రోఫెన్ వంటి సాధారణ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: అల్లం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి , రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: గ్రీన్ కాఫీ ఎప్పుడైనా త్రాగారా ? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: అల్లం జీవక్రియను పెంచడంలో , ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అల్లం కొవ్వును తగ్గించే ప్రక్రియను పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలపని అనుకునే వారు తరుచుగా అల్లం తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.