ICC Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) త్వరలోనే ప్రారంభం కానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దూల తీర్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) విషయంలో.. టీమిండియా, పాకిస్థాన్ మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ తరునంలోనే…పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ( Pakistan Cricket Board ) షాక్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియా జట్టు జెర్సీపై ఆతిథ్య దేశం అయిన ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కంగు తిన్నది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఈ తరుణంలోనే… పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ వివాదం బయటపడింది. టీమిండియా జట్టు జెర్సీపై ( Indian jersey ) ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీసీసీఐ.
Also Read: IND vs Eng 1st Odi: అదానీ కోసం..టీమిండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు ?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో భారత్ తమ మ్యాచ్ లు మొత్తం దుబాయ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. హై బ్రిడ్ మోడల్ కాబట్టి.. దుబాయ్‌లో టీమిండియా తన అన్ని మ్యాచ్ లు ఆడనుంది. ఇక ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ అధికారిక హోస్ట్‌గా ఉంది. టీమిండియా మినహా అన్ని మ్యాచ్ లు మొత్తం పాకిస్తాన్ లో ( Pakistan ) జరుగుతాయి. ఈ తరుణంలోనే… ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ( ICC Champions Trophy 2025 ) ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉంటుంది. అది అనవాయితీగా వస్తోంది. కానీ… టీమిండియా జట్టు జెర్సీపై ( Indian jersey ) ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది.
భారత్ ( Team India), పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు సమస్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా జట్టు జెర్సీపై ‘పాకిస్తాన్’ పేరు ముద్రిస్తే.. వివాదాలు పెరిగే ఛాన్సు ఉంది. ఇదే అంశాన్ని బీసీసీఐ చెబుతోంది. అటు ఐసీసీకి ( ICC ) కూడా తెలియజేసింది బీసీసీఐ ( BCCI ). ఆ తర్వాతనే.. ‘పాకిస్తాన్’ పేరు లేకుండానే… ICC ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy 2025 ) కోసం జెర్సీని విడుదల చేసిందట బీసీసీఐ. ఇంకా అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.
Also Read: Watch: ముసలోడే కానీ మహా ముదురు..ఈయన ముందు రోహిత్, కోహ్లీ పనికి రారు !
అయితే.. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉండాల్సిందేనని అంటోందట పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అంతేకాదు.. బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసిందట పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ). దీంతో జెర్సీల వివాదం రాజుకుంటోంది. ఇక దీనిపై పీసీబీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, టీమ్ ఇండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించడానికి నిరాకరించడం దారుణం అన్నారు. అనవసరంగా ‘క్రికెట్‌లో రాజకీయాలు’ తీసుకువస్తోందని బీసీసీఐపై మండిపడ్డారు. ఇక అటు ఛాంపియన్స్ ట్రోఫీకి కర్టెన్ రైజర్ ఈవెంట్ అయిన కెప్టెన్ల మీట్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించిన సంగతి తెలిసిందే.
🚨 NO PAKISTAN ON INDIA’S JERSEY. 🚨
– The BCCI has refused to print Pakistan on the Indian jersey for the 2025 Champions Trophy. (IANS). pic.twitter.com/LHpN1D6TFU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025