Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముంబైలోని ఓషివారాలో ఉన్న తన కాస్ట్లీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను తాజాగా అమ్మేశారు. నాలుగేళ్ల క్రితం కొన్న ఈ అపార్ట్మెంట్ ను ఆయన అమ్మిన ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. బిగ్ బి తన ఫ్లాట్ ను అమ్మి ఏకంగా 168 శాతం లాభం పొందడం హాట్ టాపిక్ గా మారింది.
నాలుగేళ్లలోనే ఇంత లాభమా !
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇటీవల ముంబైలోని ఓషివారాలోని తన విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.83 కోట్లకు అమ్మేశారు. ఓషివారా అనేది MMR (ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం)లో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ ప్రాంతం. ఇక అమితాబ్ ఈ అపార్ట్మెంట్ ను అమ్మడం ద్వారా భారీ లాభాలను తన జేబులో వేసుకున్నారు. బిగ్ బి ఈ అపార్ట్‌మెంట్‌ని ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2025 జనవరిలో దాని ధర ఏకంగా రూ. 83 కోట్లుగా మారింది. అంటే దీని ధర 168 శాతం పెరిగినట్టు లెక్క. అయితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు అంతగా పెరగలేదు. కానీ అమితాబ్ బచ్చన్ ఫ్లాట్ కావడం వల్ల అక్కడ ఇంత భారీ ధర పలకడానికి ఒక కారణం కావచ్చు.
ఇక ఈ ప్లాట్ ధర రూ.83 కోట్లు కాగా, ఈ డీల్ ఈ ఏడాది జనవరిలోనే జరిగింది. ఇందులో స్టాంప్ డ్యూటీ సుమారు రూ. 5 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 30,000. ఇదే అపార్ట్మెంట్ ను హీరోయిన్ కృతి సనన్ 2021 నవంబర్ లో అద్దెకు తీసుకున్నారు. ఈ ఫ్లాట్ అద్దె నెలకు రూ.10 లక్షలు, సెక్యూరిటీ డిపాజిట్ రూ.60 లక్షలు కావడం విశేషం. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ దాదాపు 529.94 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి పెద్ద టెర్రస్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్లో 6 మెకనైజ్డ్ కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.
100 కోట్ల ఆస్తులు కొన్న బిగ్ బీ
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కు ఉన్న ఆస్తి ఇదే కాదు. గతేడాది జూన్‌లో అంధేరీ వెస్ట్‌లో దాదాపు రూ.60 కోట్లతో మరో మూడు కమర్షియల్ ప్లాట్ లను కొన్నారు. అలాగే అంధేరి వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్‌లో ఉన్న సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఆయన కొన్న ఈ అపార్ట్మెంట్లు కూడా ఆఫీస్ యూనిట్లె. అలాగే ఒకే బిల్డింగ్ లో 8,396 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు యూనిట్లను దాదాపు రూ. 29 కోట్లకు కొన్నారు. 2023 సెప్టెంబర్ 1న ఈ ఆస్తి కొనుగోలుపై రూ. 1.72 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కలిసి ముంబైలోని ములుండ్ ప్రాంతంలోని ఒబెరాయ్ ఎటర్నా ప్రాజెక్ట్‌లో 10 అపార్ట్‌మెంట్లను కొన్నారు. ఈ అపార్ట్‌మెంట్ల ధర రూ.24.95 కోట్లు. మొత్తంగా కలిపి రియల్ ఎస్టేట్ లోనే దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెట్టారు అమితాబ్.
ఇదిలా ఉండగా అమితాబ్ చివరిసారిగా గత సంవత్సరం రజనీకాంత్ చిత్రం ‘వెట్టయన్’లో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ‘ఆంఖ్ మిచోలీ 2’లో కనిపించనున్నాడు.