Ajwain Water Benefits: వాము నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు, శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వాము నీరు తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వాము నీరు ఎలా తయారు చేసుకొని తాగాలి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాము నీటి వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వాము నీరు జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది కడుపులోని గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపించి, ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయ డుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
వాము నీరు జీవక్రియను (మెటబాలిజం) పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి సహజ పరిష్కారం.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం:
వాములో ఉండే థైమోల్ వంటి సమ్మేళనాలు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది గొంతులోని కఫాన్ని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
నొప్పులను తగ్గిస్తుంది:
వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్), పంటి నొప్పి , పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్, బీపీని నియంత్రిస్తుంది:
వాము నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
శరీరాన్ని శుభ్రపరుస్తుంది (డిటాక్స్):
వాము నీరు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థపదార్థాలను మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపి, కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వాము నీటిని ఎలా తయారు చేసుకోవాలి ?
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి.. ఖాళీ కడుపుతో తాగాలి.
లేదా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని, ఒక టీస్పూన్ వాము వేయాలి. ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత దాన్ని చల్లార్చి, వడకట్టి గోరు వెచ్చగా తాగాలి.
Also Read: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వాము నీరు చాలా మంచిదైనప్పటికీ, కొన్ని విషయాలను గమనించాలి:
గర్భిణీ స్త్రీలు: గర్భిణీలు వామును ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది గర్భస్రావానికి కారణం కావచ్చు. వారు వాము నీరు తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
శరీర వేడిని పెంచుతుంది: వాము శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి, వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
మోతాదు: ఏదైనా మంచిదే కదా అని ఎక్కువగా తాగకూడదు. రోజుకు ఒక గ్లాసు వాము నీరు సరిపోతుంది.
మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే లేదా ఏమైనా మందులు వాడుతుంటే.. వాము నీరు తీసుకోవడం ప్రారంభించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.