BigTV English

Akukura Biryani : నాన్ వెజ్ బిర్యానీ బోర్ కొట్టిందా.. ఒక్కసారి ఈ ఆకు కూరతో బిర్యానీ ట్రై చేయండి.. అదిరిపోతుంది

Akukura Biryani : నాన్ వెజ్ బిర్యానీ బోర్ కొట్టిందా.. ఒక్కసారి ఈ ఆకు కూరతో బిర్యానీ ట్రై చేయండి.. అదిరిపోతుంది

Akukura Biryani : భారదేశపు వంటకాల్లో ప్రతీ ఒక్కరికి ఇష్టమైన వంటకం ఏది అంటే నిద్రలో లేచి అయినా బిర్యానీ అని చెప్పేస్తారు. బిర్యానీ అంటే అసలు ఇష్టంలేని వారు ఎవరు ఉండరు. ఒక్కసారి బిర్యాని పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ బిర్యానీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చేపల బిర్యానీ, పీతల బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇలా ఎన్నో రకాల నాన్ వెజ్ బిర్యానీలు ఉన్నాయి. ఇవే కావు తెలియనివి కూడా చాలానే ఉన్నాయి. నాన్ వెజ్ మాత్రమే కాకుండా కూరగాయలతో తయారు చేసే బిర్యానీలు కూడా ఫేమస్ అనే చెప్పాలి. వెజిటేబుల్ బిర్యానీ, వంకాయ బిర్యానీ, పనీర్ బిర్యానీ, వంటివి కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ తరచూ చాలా మంది రుచి చూసే ఉన్నారు. కానీ ఆకుకూరలతో తయారుచేసే బిర్యానీ తింటే అన్ని బిర్యానీలు పక్కన పెట్టేస్తారు.


ఆకుకూరలతో విటన్నింటికంటే ఎంతో రుచికరమైన బిర్యానీని తయారుచేసుకోవచ్చు. తరచూ అన్ని రకాల బిర్యానీలు తిని బోర్ కొట్టిన వారు ఒక్కసారి ఆకుకూరలతో తయారుచేసిన బిర్యానీని తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇది రుచితో పాటు ఎన్ని సార్లు తిన్నా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఆకుకూరలతో బిర్యానీని ఎలా తయారుచేసుకోవాలి ? బిర్యానీ తయారు విధానం ఎలా ? వంటి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు :


బిర్యానీ మసాలా దినుసులు – సరిపడా
బాస్మతీ రైస్ – ఒక గ్లాసు
నూనె – 2 స్పూన్స్
కరివేపాకు, పుదీనా, కొత్తి మీర – 1 కప్పు
సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1
కట్ చేసుకున్న పచ్చిమిర్చి – 2
టమాటా – 1
తోటకూర – 2 కట్టలు
పసుపు – 1/4 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీ స్పూన్,
ధనియాల పొడి – 1 1/2 స్పూన్,
ఉప్పు – రుచికి సరిపడా,
గరం మసాలా – 1
జీడి పప్పు – గుప్పెడు

మసాలా పేస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు :

కొత్తిమీర – గుప్పెడు
పుదీనా – గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు – 8
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – 5

తయారీ విధానం :

ముందుగా బిర్యానీ తయారీ కోసం మందపాటి ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నూనె, లేదా నెయ్యి వేసుకోవాలి. వేడి అయిన తర్వాత బిర్యానీ మసాలా దినులు, జీడిపప్పు వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. బాగా వేగిన అనంతరం టమాటా ముక్కలు వేసి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మెత్తగా అయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన అనంతరం తోటకూరను వేసి బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, మిగిలిన పదార్థాలు వేసి వేయించుకోవాలి.

తోటకూర బాగా ఉడికిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అనంతరం మరుగుతున్న నీటిలో ఉప్పు సరిపడా ఉందో లేదో రుచి చూసి కడిగి నానబెట్టుకున్న బాస్మతీ రైస్ వేసి కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాసేపు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బిర్యానీని అయ్యేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత అన్నం ఉడికింది అనిపిస్తే కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపుకోవాలి. అయితే ఇందులో తోటకూరతో తయారుచేసుకున్నాం కాబట్టి, దాని ప్లేస్ లో పాలకూరను కూడా ఉపయోగించుకోవచ్చు.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×