Satyabhama Serial Today Episode September 30th :గత ఎపిసోడ్ లో సత్య మహదేవయ్య అసలు నిజం క్రిష్ కు తెలిసేలా చెయ్యాలని అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. అది తెలుసుకున్న మహదేవయ్య ఆ ప్లాన్ ఫ్లాఫ్ అయ్యేలా చేస్తాడు. ఇక సత్యకు క్రిష్ సపోర్ట్ గా నిలుస్తాడు. మహాదేవయ్యను ఎలాగైనా ఇరికించాలని అసలు నిజం బయటకు వచ్చేలా చెయ్యాలని సత్య ఆలోచిస్తుంది.. మీ మధ్య గొడవలకు కారణం నేను అవ్వకూడదు అని అంటుంది.. ఇక నందిని హర్ష మధ్య మరోసారి గొడవకు మైత్రి కారణం అవుతుంది. అప్పుడే మహదేవయ్య వచ్చి ఏంటి కోడలా ఆలోచిస్తున్నావ్. పాతికెళ్ళ నుంచి దాస్తున్న నిజాన్ని ఎలా బయట పెట్టాల అని చూస్తున్నావా అని అంటాడు. ఎలాగైనా క్రిష్ కు నిజం చెప్పాలని సత్య ప్రణాళికలు రచిస్తుంది. ఇక దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య రాత్రి గార్డెన్ లో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది కోడలు కానీ కోడలా అని అంటాడు. చూసావ్గా ఏమైందో నాతో పెట్టుకొని గెలవడం కష్టమే.. నా గురించి నీకు ఇంకా తెలియదు కోడలా నువ్వు చేసిన దానికి ఏమి మనలో నాకు అర్థం కావట్లేదు.. నన్ను ఇరికిచ్చేద్దాం కృష్ణ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని చేద్దామని చాలా ఆలోచించావు కానీ నీ ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుంది అని అసలు ఊహించలేదు కదా కోడలు గాని కోడలా.. ఒక్కసారి ఏదో ఫెయిల్ అయ్యాను కదా అని రోజు ఫెయిల్ అవుతానని అస్సలు అనుకోవద్దు ప్రతిరోజు ఏదో ఒకటి ఎలాగోలాగా కృష్ణకు తెలిసేలా చేస్తానని సత్యా మహదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. అవును అవును నీ తెలివికి మెచ్చుకోవాల్సిందే.. గడ్డి పూచతో గుడ్డను లాగడం అంటే ఇదే అని మహదేవయ్య సత్యతో అంటాడు. దానికి సత్య మహదేవయ్యను ఆ గడ్డి పోసే సర్పము లాగా మారుతుందని, ప్రాణాలు కూడా తీయొచ్చు అని చెబుతుంది.. ఏంలు మాత్రమే నాది కాదని మాధవి అంటారు ఇంట్లో వాళ్లే కాదు బయట కూడా ఈ ఊరు నాదే.. బయట చీమ చుట్టుకుమన్న నాకు ఇట్టే తెలిసిపోతాయి అలాంటిది నువ్వు ఇలా చేస్తావని నాకు తెలియకుండా ఉంటుందా అని మహదేవయ్య సత్యతో అంటాడు.
దానికి సత్య ఒక్కసారి ఫెయిల్ అయ్యాను కదా అని మళ్ళీ ఫెయిల్ అయితాం అని అనుకోవద్దు. అసలు నిజం ఏంటో బయటకు వచ్చేంతవరకు నేను నిద్ర పోను అంటూ సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది. నేను ఎలాగైనా గెలుస్తాను నా గెలుపు కోసం నేను ఎదురు చూస్తాను అని సత్య, మహాదేవయ్యతో మాట్లాడుతుండటం క్రిష్ చూస్తాడు. ఏంటో బాపు తో గెలుస్తానని అంటున్నావ్ అని క్రిష్ సత్యను అడుగుతాడు. బాపు కదా ఎమ్మెల్యేగా గెలవలని అనుకుంటున్నాడు. మరేంటి నువ్వు ఇలా అంటున్నావ్ అని అంటాడు. దానికి దానికి సత్య మామయ్య గారి గెలుపు నా గెలుపు కదా అందుకే ఇలా అన్నాను క్రిష్ అని ఉంటుంది. ఇక మహదేవయ్య కూడా నా మనసు గురించి కోడలికి తెలుసు అంటాడు. ఇక మీ ఇద్దరికీ ఒకరి మనసు మరొకరికి తెలుసు. నాకే ఏమి తెలియదు అంటాడు..
ఇక హర్ష వాళ్ళ ఇంటికి హర్ష వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడే మైత్రి టీ తీసుకొని వస్తుంది. అక్కడున్న ఆవిడ మీ పెళ్లికి రాలేకపోయాను అమ్మ మీ మామయ్య గారు పిలిచారు ఇది నా గిఫ్ట్ అని అమ్మాయికి గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడే అక్కడికి నందిని వస్తుంది. మైత్రి నీకు కోడలు అనడం చూసి అందరూ షాక్ అవుతారు. అక్కడికొచ్చి పెద్ద రాద్ధాంతమే చేస్తుంది. నందిని మైత్రిని ఇన్ డైరెక్టుగా తిడుతున్నట్టు అందరి ముందు మాట్లాడుతుంది. ఇక ఇంటికొచ్చిన గెస్ట్లు మమ్మల్ని క్షమించు రా మేము కోడలు అనుకున్నాం తప్పు మాదే అని వెళ్ళిపోతారు. ఇక నందిని లోపలికి వెళ్తుంది అప్పుడే హర్ష వెళ్తాడు. ఇంటికొచ్చిన గెస్ట్ ల ముందు అలా మాట్లాడటం అవసరమంటావా అని నందినిని హర్ష అడుగుతాడు. నీ గురించి గొప్పగా చెప్పొచ్చు కదా అందులో తప్పేముంది ఇలా అందరి ముందు అవమానించినట్లు మాట్లాడడం అవసరమా అని హర్ష నందిని నిలదీస్తాడు. దానికి కోపంతో రగిలిపోయిన నందిని లోపలికి వచ్చి నాకు సారీ చెప్తావని అనుకున్నాను నీకు ముద్దు ఇవ్వాలని కూడా అనుకున్నాను కానీ నువ్విల నన్నే అరుస్తావని అనుకోలేదు అంటుంది.
ఇక ఇంటికి వచ్చిన క్రిష్ తను గొడవ పడిన విషయం గురించి సత్య తెలిస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుందని, తగిలిన గాయాన్ని కర్చీఫ్ తో కవర్ చేస్తాడు. ఇక లోపలికి వెళ్ళగానే సత్య కోపంగా ఉందని గమనిస్తాడు. సత్య ఎంత అందంగా ఉన్నావ్ కోపంలో కూడా నువ్వు ఇంత అందంగా ఉన్నావు తెలుసా అంటూ కృష్ణ నాలుగు డైలాగులు వదులుతాడు. దానికి సత్య అవునా నిజమా ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్లారు? ఏం చేసి వచ్చారు? అని అడుగుతుంది. దానికి బాపు చెప్పిన పని చేసానని చెబుతాడు. కాసేపు వీరిద్దరి మధ్య రొమాంటిక్ ముచ్చట జరుగుతుంది. సత్య చెప్పిన యూనివర్సిటీ సీటు గురించి అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో శోభనం కోసం క్రిష్ బామ్మ తో గొడవ పడతాడు. అది చూసిన రుద్ర ఈ సత్య మనశాంతి లేకుండా చేస్తుంది. దీన్ని చంపేయాలని మహదేవయ్య తో చెబుతాడు. రేపు ఏం జరుగుతుందో చూడాలి..