Homemade Face Serum: నేటి ఆహారపు అలవాట్లు, కాలుష్యం ,చెడు జీవనశైలి సున్నితమైన ముఖంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు, పొడిబారడం వంటివి ప్రారంభమవుతాయి. ఇలాంటి సమయంలోనే చాలా మంది అమ్మాయిలు తమ ముఖాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి వివిధ రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. వీటి కోసం వేలల్లో ఖర్చు చేస్తే వారు కూడా చాలా మందే ఉంటారు. కానీ కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇదిలా ఉంటే గ్గోయింగ్ స్కిన్ కోసం ఫేస్ సీరం వాడటం తప్పనిసరి దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఇంట్లో ఫేస్ సీరం ఎలా తయారు చేసుకుని వాడాలి. దీని యొక్క ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లోయింగ్ స్కిన్ కోసం తక్కువ బడ్జెట్‌లోనే ఇంట్లోనే సీరం తయారు చేసుకోవచ్చు. సీరంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
ఫేస్ సీరం తయారీకి కావలసిన పదార్థాలు:
విటమిన్ సి క్యాప్సూల్స్ – 2
విటమిన్ ఇ ఇ క్యాప్సూల్స్- 1
రోజ్ వాటర్- 2 స్పూన్లు
అలోవెరా జెల్- 1 స్పూన్లు
గ్లిజరిన్- 1 స్పూన్
ఒక చిన్న గాజు సీసా
సీరం తయారు చేసే విధానం:
ముందుగా ఒక శుభ్రమైన బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదులో కలబంద జెల్ , రోజ్ వాటర్ వేయండి. తరువాత అందులో విటమిన్ ఇ , సి క్యాప్సూల్స్ వేయండి.
ఇప్పుడు దానిలోనే గ్లిజరిన్ వేసి అన్ని పదార్థాలను బాగా కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. అంతే మీ ఇంట్లో తయారుచేసిన ఫేస్ సీరం వాడటానికి సిద్ధంగా ఉంది. దీనిని ఒక గాజు సీసాలో నింపి ఒక వారం పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
ఈ సీరం ఎలా ఉపయోగించాలి ?
మీరు సీరంను పగలు, రాత్రి రెండు సమయాల్లోనూ ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు, క్లెన్సర్ సహాయంతో ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి. తర్వాత ఫేస్ టోనర్ ఉపయోగించండి. ఇది మీ చర్మం యొక్క pH ని సమతుల్యం చేస్తుంది. ఇప్పుడు మీ చేతివేళ్లపై కొన్ని చుక్కల సీరం తీసుకొని దానిని ముఖ చర్మంపై సున్నితంగా అప్లై చేయండి. కొన్ని నిమిషాల తర్వాత మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ రాయండి.
2. రోజ్ వాటర్ ,గ్లిజరిన్ సీరం:
ఫేస్ సీరం తయారు చేయడానికి మీకు రోజ్ వాటర్, గ్లిజరిన్, నిమ్మరసం అవసరం. దీన్ని తయారు చేయడానికి ఒక చెంచా రోజ్ వాటర్, అర చెంచా గ్లిజరిన్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి సీరం సిద్ధం చేయండి. ఈ సీరం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.
Also Read: విపరీతంగా జుట్టు రాలుతోందా ? ఈ టిప్స్ మీ కోసమే !
3. గ్రీన్ టీ , విటమిన్ సి సీరం:
ఫేస్ సీరం తయారు చేయడానికి మీకు గ్రీన్ టీ, విటమిన్ సి పౌడర్ అలోవెరా జెల్ అవసరం అవుతాయి. దీనిని ని తయారు చేయడానికి చల్లబడిన గ్రీన్ టీలో 1/2 టీస్పూన్ విటమిన్ సి పౌడర్ , 1 టీస్పూన్ అలోవెరా జెల్ కలపండి. ఇలా తయారు చేసిన ఈ సీరంను ముఖానికి తరచుగా అప్లై చేయండి. రోజుకు రెండు సార్లు దీనిని వాడటం వల్ల ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.