Salman Khan.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈమధ్య సినిమాలకంటే వ్యక్తిగత కారణాలవల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కృష్ణ జింకను చంపిన నేపథ్యంలో జైలుకి వెళ్లిన ఈయన.. కృష్ణ జింకను ఆరాధ్య దైవంగా భావించే భీష్నోయ్ వర్గం నుండి హత్యా బెదిరింపులు నేటికీ ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. ఇక వారికి భయపడి రూ.2కోట్ల విలువచేసే బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా నియమించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ దుండగుల నుండి తనను తాను కాపాడుకోవడం కోసం.. ఎక్కడికి వెళ్లినా బాడీగార్డ్స్ సహాయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోతాను..
ఇకపోతే తాజాగా తన మేనల్లుడు అర్హాన్ ఖాన్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్.. జైలు జీవితాన్ని గడిపిన రోజులను గుర్తు చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.” నేను ప్రతిరోజు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతాను. నెలకి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 8 గంటలు. అప్పుడప్పుడు షూటింగ్లో కాస్త బ్రేక్ దొరికితే చైర్ మీదే నిద్రపోతాను. ఇక పని లేదు అనిపించినప్పుడు పడుకుంటాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఏ పని చేయలేదు కాబట్టే ఎక్కువ సమయం నిద్రపోయాను” అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ నిర్గాంత పోయారు..సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. అలాంటిది సల్మాన్ ఖాన్ రోజుకు రెండు గంటలు మాత్రమే పడుకుంటానని చెప్పడంతో అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ తో.. ఆయన వ్యవహరిస్తున్న తీరుకి అందరూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. కనీసం 6 గంటల సేపైనా నిద్రపోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి అభిమానుల సలహా మేరకు సల్మాన్ ఖాన్ తన తీరును మార్చుకుంటారేమో చూడాలి.
సల్మాన్ ఖాన్ కెరియర్..
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రముఖ నటుడిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈయన అసలు పేరు ‘అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ ‘. బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన. సౌత్ ఇండస్ట్రీలో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషించి పేరు దక్కించుకున్నారు. ఈయన తండ్రి సలీంఖాన్ స్క్రీన్ రచయిత. సల్మాన్ ఖాన్ 1988లో బీవీ హోతో అయిసీ అనే సినిమా ద్వారా సహాయ నటుడిగా తరంగేట్రం చేసినా.. 1989లో సూరజ్ బర్జత్య దర్శకత్వంలో వచ్చిన ‘మైనే ప్యార్ కియా’ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకున్న సల్మాన్ .. ఇటు బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ.. బుల్లితెర పై కూడా సక్సెస్ అయ్యారు.