Anasuya: అనసూయ (Anasuya)బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే అనసూయ మంచి పాపులారిటీ సొంతం చేసుకోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా క్రమక్రమంగా సినిమా అవకాశాలను అందుకుంటూ వెండితెరపై కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లి తెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలతో పాటు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో అనసూయ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇటీవల గోల్డ్ షాపింగ్ మాల్స్ , క్లాత్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్న ఈమె తాజాగా సూర్యాపేటలోని మణిముఖుర జ్యూవెలరీ (Manimukhura Jewellery)ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సూర్యాపేట పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని తెలియజేశారు. ఇకపోతే ఆడవాళ్లకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పెరిగిపోతున్న ఈ బంగారు ధరలను దృష్టిలో పెట్టుకొని మణిముఖుర జువెలరీ వారు కస్టమర్లకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో మీ ముందుకు తీసుకు వచ్చారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ..
రోజురోజుకు నా వయసు తగ్గిపోతుంది బంగారం ధర పెరుగుతుంది అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం కొనుక్కోవాలని తెలిపారు. బంగారం అంటే కేవలం మహిళలకు మాత్రమే కాదు మగవారికి కూడా చాలా ఇష్టమని మగవారు బంగారం పై పెట్టుబడులు పెడుతూ పొదుపు చేసుకుంటున్నారని అనసూయ తెలిపారు. ఇలా బంగారం గురించి తన వయసు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
?igsh=MXh0anJ5a3J2cTl4dg%3D%3D
ఇక అనసూయ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తన గురించి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వారికి తనదైన స్టైల్ లోనే అనసూయ సమాధానం చెబుతూ ఉంటారు. ఇలా పలు సందర్భాలలో నేటిజెన్లతో ఈమె వివాదానికి దిగి ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అనసూయ సినిమాల విషయానికి వస్తే బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా(Peddi Movie)లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే స్పిరిట్ సినిమాలో కూడా అనసూయ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలియజేశారు
Also Read: Dheeraj Mogilineni: ప్రీ రిలీజ్ ఈవెంట్లు పరమ వేస్ట్..కొత్తగా ట్రై చేయమంటున్న నిర్మాత!