Hero Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గత ఏడాది అభిమాని హత్య కేసులో జైలుకు వెళ్లాడు. దాదాపు కొన్ని నెలల పాటు ఆయన జైల్లోనే గడిపారు. గతేడాది చివరి నెల డిసెంబర్ 13 న తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ పై విడుదలయ్యారు. అనారోగ్యానికి వైద్య చికిత్స అవసరాల రీత్యా కోర్టులో బెయిల్ మంజూరైంది.. బెయిల్ పై బయటకు వచ్చిన హీరోకు ఓ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మొదటిసారి ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన సినిమాల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు దర్శన్ ఏమన్నారు? సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కన్నడ స్టార్ హీరో దర్శన్ మాట్లాడుతూ.. తన అభిమానులను సెలబ్రిటీలు అంటూ సంబోధిస్తూ.. ప్రతి ఒక్కరినీ కలిసి వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని కానీ నాకున్న ఆరోగ్య సమస్య కారణంగా తీవ్రమైన నొప్పి తో ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు. కష్ట సమయాల్లోను మీ ప్రేమ నన్ను ముందుకు నడిపించింది. ఎన్నో సమస్యలు నన్ను చుట్టు ముట్టాయి. మనసులో తెలియని భయం ఉండేది. ఏదేమైనా మీ ప్రేమ నన్ను బయటకు తీసుకొచ్చింది.. అయితే ఈ సంవత్సరం నేను మీ అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయినా ఎప్పటికీ కృతజ్ఞుడను అని దర్శన్ అన్నారు.. మీ ప్రేమ నాకు తోడు ఉన్నంత కాలం నేను ఎప్పుడు ఇలానే యాక్టివ్ గా ఉంటూ మరిన్ని సినిమాల ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే గతంలో కమిటైన సినిమాలను త్వరగా పూర్తి చేస్తానని దర్శన్ అనడం విశేషం.
మీ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను నేను సినిమాలు తీసి మీ ఆదరాభిమానాల్ని తిరిగి పొందాలని అనుకుంటున్నా .. నావల్ల ఎవ్వరు నష్ట పోకూడదు. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాను. నాకు ఎంత నొప్పి వచ్చినా కూడా ఇంజక్షన్లు వేసుకుని మరి సినిమాలను పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తానని దర్శనం అన్నారు.. అదే విధంగా నేను కమిటీని సినిమాకు నిర్మాత దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల ను నేను మళ్లీ వెనక్కి తిరిగిచ్చేసాను. డబ్బులు మాత్రమే ఇచ్చాను కానీ నేను కన్నడ ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్లిపోలేదు అని క్లారిటీ ఇచ్చారు దర్శన్. ఇకపోతే నేను ఇతర భాషలలో సినిమాలు చేస్తున్నా అని వినిపిస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులను కోరాడు. నేను ఎప్పటికీ కన్నడ సినిమాకి కట్టుబడి ఉన్నాను. నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానని దర్శన్ ఎమోషనల్ అయ్యాడు.. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు త్వరగా కోలుకొని వరుసగా సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాం అని కామెంట్లు పెడుతున్నారు..