E-Paper
Advertisement

Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!
Advertisement

Kodangal: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అక్షయ పాత్ర ఫౌండేషన్, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గంలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొడంగల్‌లో అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను కూడా స్వీకరించనుంది.

ఈ కార్యక్రమ వివరాలను చర్చించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పథకం అమలు కోసం కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లి గ్రామంలో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ‘గ్రీన్ ఫీల్డ్ కిచెన్’ నిర్మించనున్నట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు. నవంబర్ 14వ తేదీన తలపెట్టిన ఈ కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు.

Advertisement

ఈ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ద్వారా వండిన నాణ్యమైన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు వేడివేడిగా సరఫరా చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి రూ. 7 చొప్పున చెల్లిస్తోంది. అయితే, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన భోజనం అందించేందుకు ఒక్కో విద్యార్థిపై సుమారు రూ. 25 వరకు ఖర్చు చేయనుంది. ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఈ భారీ వ్యయాన్ని ఫౌండేషన్ స్వయంగా భరించనుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Read Also:  Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!

Advertisement

గత ఏడాది డిసెంబర్ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అందించనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థ భారతదేశానికి చెందిన ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ (NGO). 2000 సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభమైంది. “పాఠశాలకు ఏ ఆకలితో ఉన్న విద్యార్థి రాకూడదు” అనే సంకల్పంతో పనిచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నేడు, భారతదేశంలోని 16 రాష్ట్రాలు,  2 కేంద్రపాలిత ప్రాంతాల్లో, 72 అత్యాధునిక వంటశాలల ద్వారా ప్రతిరోజూ 2 మిలియన్లకు (20 లక్షలకు) పైగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×