BigTV English

Homemade Hair Mask: మీ జుట్టు పెరగాలా.. అయితే ఇలా చేయండి

Homemade Hair Mask: మీ జుట్టు పెరగాలా.. అయితే ఇలా చేయండి

Homemade Hair Mask: ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు ప్రతి ఒక్కరి కల. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో పాటు అనేక కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్నారు. దీంతో జుట్టు పొడిగా, నిర్జీవంగా మారడమే కాకుండా బలహీనంగా మారుతుంది. అలాంటి సమయంలోనే జుట్టును ఎలాగైనా కాపాడుకోవాలని ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.


అయినా కూడా ఫలితం అంతంత మాత్రమే. ఇలా జరగకుండా ఉండాలి అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది. వీటి వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరో ఆప్షన్ హోం మేడ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఇవి ప్రభావవంతగా పని చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తాయి.

1. ఎగ్, పెరుగు హెయిర్ మాస్క్:


ఎగ్స్ – 2
పెరుగు- 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ నూనె- 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్‌ను పగలకొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పెరుగు, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పట్టించి కనీసం 30-45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో జుట్టును కడగండి. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.

2. అలోవెరా , కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:

తయారీ విధానం:
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదులో ఒక గిన్నెలో అలోవెరా జెల్, కొబ్బరి నూనెను తీసుకుని ఈ రెండింటిని బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. ఆ తర్వాత దీనిని 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం గోరువెచ్చని నీటితో పాటు షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా బలంగా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ ముఖ్యంగా జుట్టు రాలుతున్న సమస్యతో ఇబ్బందిపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. అరటి , తేనె హెయిర్ మాస్క్:

అరటి పండు- 1
తేనె- 1 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె -1 టేబుల్ స్పూన్

Also Read: చుండ్రు సమస్య వేధిస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే రిజల్ట్స్​ పక్కా​!

తయారీ విధానం:
అరటిపండును ఒక గిన్నెలో వేసి మెదుపుకోండి. అందులో పైన చెప్పిన మోతాదుల్లో తేనె, కొబ్బరి నూనె కలపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు సహజమైన మెరుపును తెస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ చుండ్రు సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Big Stories

×