బిర్యానీలో, పులావులో రెండు బిర్యానీ ఆకులు పడాల్సిందే. నిజానికి బిర్యానీ ఆకులో ఉండే ఆరోగ్య పోషకాలు ఎంతో ఎక్కువ. కానీ వాటిని తినకుండా బయటపడేస్తూ ఉంటారు. మాంసాహారంలో కూడా ఖచ్చితంగా బిరియాని ఆకును వేస్తారు. ఇది మాంసానికి ఒక విలక్షణమైన రుచిని అందిస్తుందని నమ్ముతారు. అయితే బిర్యానీ ఆకులు ప్రతిరోజూ తినడం ఆరోగ్యకరమా కాదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.
బిర్యానీ ఆకు చరిత్ర
బిర్యానీ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు
బిర్యానీ ఆకులు వంటల్లో ఉపయోగించడం పూర్తిగా సురక్షితం. ఈ ఆకులలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. ఆ నూనెలు ఆకుకి సువాసనను, రుచిని అందిస్తాయి. వేడికి గురిచేసినప్పుడు ఆ నూనె ఆహారంలోకి విడుదలవుతుంది. అందుకే బిర్యానీ ఆకు వేసిన ఆహారం ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అయితే తినేటప్పుడు మాత్రం ఆకులను తీసేయాలని అంటారు. దీనికి కారణం ఆకులు సరిగ్గా జీర్ణం కావంటారు. ఇది జీర్ణవ్యవస్థలో సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతారు. ముఖ్యంగా పేగు పొరల్లో ఈ ఆకు చిక్కుకుపోయే అవకాశం ఉందని అంటారు. అందుకే ఈ ఆకులను పూర్తిగా తినాల్సి వస్తే పొడి రూపంలో చేసి అన్నంలో కలుపుకోమని చెబుతారు.
శాఖాహారంలోనూ..
కేవలం మాంసాహారాల్లోనే కాదు శాఖాహారంలో కూడా బిర్యానీ ఆకులను వేసుకొని తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల నుండి తీసే నూనె కొన్ని ఔషధాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యకు చికిత్సగా కూడా వీటిని ఉపయోగిస్తారు. బిర్యాని ఆకులను పొడిచేసి పేస్టులా చేసి చుండ్రుకు అప్లై చేసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుందని ఎంతోమంది నమ్మకం. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకుంటారు. బిర్యానీ ఆకులను ప్రతిరోజూ తినవచ్చు. అయితే ఆకు రూపంలో కాకుండా పొడి రూపంలో తీసుకోండి. ఆకు రూపంలో తింటే అవి పేగుల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది.