Kotte kavya: జనసేన కార్యకర్త కొట్టే కావ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనపై అక్రమ కేసులు పెట్టారని.. కూటమి ప్రభుత్వంలో తనకు ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదని కొట్టే కావ్య ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోపై జనసేన పార్టీ స్పందించిందని చెప్పుకొచ్చారు. అధికారులతో మాట్లాడుతామని.. హామీ కూడా ఇచ్చారని ట్విట్టర్ లో మరో వీడియో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ: Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..
యువత అభిమానం, పవన్ కల్యాణ్ ఫాల్లోయింగ్ తో ఏర్పడిన రాజకీయ పార్టీ జనసేన. జనసేన పార్టీ ఏర్పాటు నుంచి వెన్నుముకగా నిలిచింది ముఖ్యంగా యువతే. 2019 ఎన్నికల్లో తొలిసారిగా జనసేనగా ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసింది. అయితే అప్పుడు జనసేన దారుణం ఓటమిని చవిచూసింది. అయినప్పటికీ.. 2024లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన విజయం సాధించింది. జనసేన పార్టీలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందర్నీ కలుపుకుంటూ ముందుకెళ్తుంది. ఈ పార్టీ ముఖ్య యువనాయకులే ఎక్కువ. జనసేన పార్టీ నుంచి ఎందరో యువ నాయకులు పుట్టుకొచ్చారు. అందులో నుంచి ఒక్కరే కొట్టేె కావ్య.
2019లో జనసేన ఘోర వైఫల్యం తర్వాత పవన్ ఏమాత్రం నిరాశ చెందలేదు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య వస్తే అక్కడకు వెళ్లి ప్రజలకు అండగా నిలిచేవారు. ఈ క్రమంలోనే 2020లో పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో యువ కార్యకర్త కొట్టే కావ్య వెలుగులోకి వచ్చారు. ప్రకాశం పర్యటనలో భాగంగా ఆయన విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా కొట్టే కావ్య మాట్లాడిన మాటలు, చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. జనసేన వీర మహిళ అంటూ పవర్ ఫుల్ స్పీచ్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే కావ్య ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి ఆమె ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ALSO READ: C-DAC HYDERABAD: బీటెక్ అర్హతతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. రూ.22లక్షల జీతం భయ్యా..
‘గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు. మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందనే నమ్మకంతో ఎనిమిది నెలలుగా అధికారులు, నాయకులు చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నా. చివరగా అనుకున్నది సాధించే క్రమంలోనే అధికారులు నాపై అక్రమ కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కూటమి ప్రభుత్వం ఓ జనసేన కార్యకర్తగా నాకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని అనుకోలేదు. నాలాంటి బిలో మిడిల్ క్లాస్ కు చెందిన అమ్మాయికి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. అయినా నా సమస్యపై న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉంటాను’ అని కొట్టే కావ్య సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ALSO READ: NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..
అయితే, కొట్టి కావ్యపై ఓ పొలం వివాదంలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనే అక్రమ కేసులు పెట్టారని తెలిసింది. అయితే ఈ ఇష్యూపై జనసేన అధిష్టానం స్పందించినట్లు కొట్టే కావ్య తెలిపారు. తన సమస్యపై జనసేన పార్టీ స్పందించిందని.. సంబంధిత అధికారులతో మాట్లాడతామని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును ప్రస్తతుం జనసేన కార్యాలయం పరిశీలిస్తుందని కొట్టే కావ్య చెప్పారు.