Kangana Ranaut: సినీ పరిశ్రమలో మాత్రమే కాదు.. బయట ప్రపంచంలో కూడా ప్రేమ, పెళ్లి, ఆపై విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. సక్సెస్‌ఫుల్ పెళ్లిళ్ల కంటే ఇలాంటి ఫెయిల్యూర్ పెళ్లిళ్లే సమాజంపై, యూత్‌పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇండియాలో ఇలాంటి కల్చర్ ఇంకా పూర్తిగా మొదలుకాలేదు. కానీ ఫారిన్ దేశాల్లో ఇదంతా ఎప్పటినుండో జరుగుతోంది. పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అనే ట్యాగ్ కోసం వెతుకుతూ వరుసగా విడాకులు తీసుకోవడం అక్కడి దేశాల్లో కామన్. ముఖ్యంగా ప్రజలకు రోల్ మోడల్‌లాగా ఉండాల్సిన హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇలాంటి పనులు చేస్తుంటారు. అందుకే వారికి బుద్ధిచెప్తూ, ఇండియన్ మ్యారేజ్‌లపై కామెంట్స్ చేస్తున్నవారికి ఇచ్చిపడేసింది కంగనా రనౌత్.
ఇండియాతో పోలిక
తాజాగా హాలీవుడ్ స్టార్లు అయిన జెన్నిఫర్ లోపేజ్ (Jennifer Lopez), బెన్ అఫ్లేక్ (Ben Affleck) విడాకులను ప్రకటించారు. వీరిద్దరూ ఇంతకు ముందు కూడా పలు రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారు. ఇద్దరి వయసు దాదాపు 50 ఏళ్లపైనే ఉంటుంది. అలాంటి వీరిద్దరూ విడాకులు తీసుకోవడంపై తన స్టైల్‌లో వ్యంగ్యంగా స్పందించింది కంగనా రనౌత్. వారి విడాకులను ఇండియన్ పెళ్లిళ్లతో పోలుస్తూ మాట్లాడింది. ‘ఇండియన్ పెళ్లిళ్లను ఫారిన్ వాళ్లు వెక్కిరించే ముందు.. చాలా తెలివిగలవాడు, ప్రముఖ యాక్టర్, ఫిల్మ్ మేకర్, రైటర్, భూమిపైనే అత్యంత అందగాడు అయిన బెన్ అఫ్లెక్.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకొని ఎంతోమంది పిల్లల్ని కన్న తర్వాత ఒక పర్ఫెక్ట్ భారయ కోసం వెతుక్కున్నాడని గుర్తుచేయండి’ అని చెప్పుకొచ్చింది కంగనా.
పర్ఫెక్ట్ పార్ట్‌నర్
‘జెన్నిఫర్ లోపేజ్ కూడా అంతే. తను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్, పాప్ స్టార్స్‌లోనే అత్యంత ధనవంతురాలు మాత్రమే కాదు ఫేమస్ కూడా. అలాంటి తను కూడా ఒక పర్ఫెక్ట్ భర్త కోసం వెతుకుతోంది. వీరిద్దరూ విడివిడిగా ఎన్నో ప్రయత్నాలు, టెస్టులు చేసిన తర్వాత కూడా వీరిద్దరికీ ఇంకెవరూ పర్ఫెక్ట్ అనిపించలేదు. కుటుంబాలు, పిల్లలు చెప్పినా కూడా వినలేదు. ఒకరి తప్పులు ఒకరికి తెలిసి కూడా చాలాసార్లు కలిసుందాం అని అనుకున్నారు. అలా చివరిసారి వారు డబుల్ ప్రామిస్‌లు చేసుకున్నారు. కానీ కొన్ని నెలల్లోనే వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం మళ్లీ వేర్వేరు మార్గాల్లో పరిగెత్తారు. ఇప్పుడు వాళ్లు 50ల్లోకి వచ్చేశారు. విడాకులు తీసుకున్నారు. మళ్లీ పర్ఫెక్ట్ పార్ట్‌నర్ కోసం వెతకడం మొదలుపెట్టారు’ అంటూ వారి వైవాహిక జీవితం గురించి అందరికీ గుర్తుచేసింది కంగనా.
Also Read: కంగనా సోదరిపై మండిపడ్డ తాప్సీ.. అసలేమైందంటే.?
అపరిచితులతో పెళ్లి
తాను ఫారిన్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకొని, అక్కడ పెళ్లి కల్చర్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది కంగనా రనౌత్ (Kangana Ranaut). ‘ఇండియాలో అసలు ఏమీ తెలియని అపరిచితులను పెళ్లి చేసుకొని 80 ఏళ్ల వయసులో కూడా చేతులు పట్టుకొని వదలకుండా ఉంటాం. అందుకే అసలు ఫారిన్ కల్చర్‌ను గొప్పగా చూడొద్దు. మన కల్చర్ ఇప్పటికే చాలా రకాలుగా కలుషితం అయిపోయింది. కానీ మనం అలా చేయకూడదు. ఫారిన్ కల్చర్‌ను ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవద్దు’ అని తెలిపింది కంగనా రనౌత్. మొత్తానికి బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.