BigTV English

Cold: వేసవిలో కూడా చలిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..

Cold: వేసవిలో కూడా చలిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..

Cold: కొందరికి ఎనీ టైం చలిగానే(cold) ఉంటుంది. వాతావరణం నార్మల్‌గానే ఉంది కదా అని అందరికీ అనిపిస్తుంది. కానీ, చలిని తట్టుకోలేని వారికి మాములు వాతావరణం కూడా వణుకు పుట్టేలా అనిపిస్తుంది. అంతేకాకుండా ఉన్నట్టుండి కాళ్లు, చేతులు చల్లబడిపోతాయి.


సీజన్‌తో పని లేకుండా కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. ఇది మరీ పెద్ద సమస్య లాగా కనిపించదు. కానీ, శరీరం చాలా వీక్‌గా ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనేక ఇతర కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎనీమియా, హైపోథైరాయిడిజం, ఫైబ్రోమైయాల్జియా వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఎక్కువగా చలిగా అనిపిస్తుందని అంటున్నారు. ఎనీ టైం చలిగానే అనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మరికొందరిలో డీహైడ్రేషన్ వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగకుండా ఉంటే కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.


శరీరం హైడ్రేటెడ్‌గా లేనప్పుడు చర్మం పొడిబారి పోతుంది. నోరు పొడిబారిపోయినట్టుగా అనిపిస్తుంది. మరికొందరిలో డీహైడ్రేషన్ సమస్య మరీ ఎక్కువగా ఉంటే కళ్లు తిరగి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ALSO READ: టీనేజ్ అమ్మాయిలు అందుకే నిద్రపోవడం లేదట..!

బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే కాళ్లు, చేతులలోని నరాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తరచుగా తిమ్మర్లు రావడం, బాడీ చల్లబడడం వంటివి జరుగుతాయట. కొన్ని సార్లు రక్తంలో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటే కూడా విపరీతంగా చలి పెడుతుందట. అందుకే ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

సాధారణంగా శరీరాన్ని వేడిగా ఉంచడంలో ఫ్యాట్ కంటెంట్ సహాయ పడుతుంది. అయితే సన్నగా ఉన్న వారి శరీరంలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బరువు తక్కువగా ఉన్న వారు కూడా చాలా సార్లు చలితో ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి వల్ల శరీర ఉష్ణోగ్రతపై కూడా చెడు ప్రభావం పడుతుందట. దీని వల్ల మెటబాలిజం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే సరిగా నిద్రపోకుండా ఉండే చాలా మందికి ఎక్కువగా చలిగా అనిపించే ఛాన్స్ ఉందట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Symptoms In Legs: కాళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

Anti Aging Tips: వయస్సు పెరుగుతున్నా.. యవ్వనంగా కనిపించాలంటే ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Big Stories

×