Madhavi Latha:ముగ్గురు అక్కచెల్లెళ్ళు మొదట సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. అలా వచ్చిన క్రేజ్ ను బిజినెస్ గా మార్చుకున్నారు. తమ తండ్రి మరణం తర్వాత పచ్చళ్ల బిజినెస్ ను మొదలుపెట్టిన ఈ ముగ్గురు సిస్టర్స్ .. తమ వ్యాపారంతో మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ చాలా సంతోషంగానే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే అనుకోకుండా ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ అక్కచెల్లెళ్లలో ఒకరైన అలేఖ్య.. కస్టమర్ తో దుర్భాషలాడిన ఆడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లపై నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఆఖరికి ముగ్గురూ క్షమాపణలు చెప్పినా.. మీమ్స్ , ట్రోల్స్ ఆగలేదు. ఆఖరికి అలేఖ్య హాస్పిటల్ పాలయ్యింది. ఈ విషయంపై ప్రముఖ స్టార్ హీరోయిన్ మాధవి లత (Madhavi Latha) స్పందించారు .అంతేకాదు నెటిజన్ లకు గట్టి కౌంటర్ ఇస్తూ.. ఒక స్ట్రాంగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు మాధవి లత. జపాన్, చైనా వాళ్లు ఏదైనా కనిపెట్టాలని పరిగెడుతుంటే.. మన యువత మాత్రం పచ్చళ్ళ పాపల వెంట పడుతున్నారేంటి? అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పనికొచ్చే పని చేయండి అంటూ యువతకు మాధవి కౌంటర్..
సమాజంలో కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొన్నటి వరకు హైకోర్టులో వక్స్ చట్టం గురించి అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. ఇక ఇటు హైదరాబాదులో హెచ్సీయూ యూనివర్సిటీలో 400 ఎకరాల లో చెట్లను ఫటా ఫటా నరికేసి అక్కడున్న జీవులకు నివాసం లేకుండా చేశారు. ఇటేమో ఐపీఎల్ జరుగుతోంది. ఇన్ని జరుగుతుంటే.. ఇవన్నీ మానేసి జనాలు పచ్చళ్ళ పాపల మీద పడ్డారు. ఆ చైనా, జపాన్ వాళ్లు ఏదేదో కనిపెడుతుంటే.. మనోళ్లు మాత్రం ఈ పచ్చళ్ల పాపలు.. పాపలు ఎలా కనిపెట్టాలనే గురించి ఆలోచన చేస్తున్నారు.. మాట్లాడుతున్నారు. వాళ్లు ఏం చేసినా చూసి వాళ్లను పాపులారిటీ చేసింది మీరు.. ఇప్పుడు పనిగట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారేంటి ? సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవ్వాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. పాపం ఆ అమ్మాయిలు క్షమాపణలు చెప్పినా కూడా విడిచిపెట్టకుండా హాస్పిటల్ పాలు అయ్యేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు.. ముందు మీ భవిష్యత్తులో మీరేమి అవాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి పనికిమాలినవి చేయకూడదు” అంటూ నెటిజన్స్ కి యువతకి గట్టి కౌంటర్ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.
Neha Shetty: రాధిక ఎక్కడ..? కంగారులో ఫ్యాన్స్..!
మాధవిలత సినిమాలు..
మాధవి లత సినిమాల విషయానికొస్తే.. 2008లో నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత స్నేహితుడా, ఉసురు, అరవింద్ 2, చూడాలని చెప్పాలని, మూడో కన్ను లాంటి చిత్రాలలో నటించింది. అలాగే తమిళ్లో అంబాల అనే సినిమాలో నటించింది. అటుపొలిటికల్ పరంగా కూడా పలు అంశాలపై స్పందిస్తూ సమాజంలో జరిగే విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
?utm_source=ig_web_copy_link