E-Paper
Advertisement

Red Sandalwood Face Packs: వావ్.. ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. మెరిసే చర్మం మీ సొంతం

Red Sandalwood Face Packs: వావ్.. ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. మెరిసే చర్మం మీ సొంతం
Advertisement

Red Sandalwood Face Packs For Glowing Skin: చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పైగా చర్మం డామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ చందనాన్ని ఉపయోగించారంటే ఖచ్చితంగా మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. కొన్ని దశాబ్దాలుగా ఎర్ర చందనాన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. దీనిని పేస్ట్ రూపంలో గానీ, పొడి రూపంలో గానీ ఉపయోగించవచ్చు. ఎలాంటి స్కిన్ అయినా సరే అద్బుతంగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఎర్ర చందనాన్ని ఈ పదార్ధాలతో కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్ర చందనం, నిమ్మకాయ ఫేస్ ప్యాక్
ఎర్రచందనం పొడిలో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి అదనపు నూనెలు విడుదల అవ్వకుండా చేస్తాయి. మీ చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

Advertisement

ఎర్రచందనం పొడి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ఎర్రచందనం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మీ ఫేస్ చాలా గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.

పెరుగు, ఎర్ర చందనం పొడి ఫేస్ ప్యాక్
రెండు స్పూన్లు ఎర్ర చందనం పొడిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. ఐదు నిమిషాల అలానే ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందే చేస్తే మీ చర్మం మెరిసిపోతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

Advertisement

Also Read:  వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

ఎర్ర చందనం, బొప్పాయి ఫేస్ ప్యాక్
రెండు, మూడు స్పూన్లు ఎర్ర చందనం పొడిలో బొప్పాయి గుజ్జు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెండు వారాలకొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా, నిత్యం తాజాగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.

ఎర్రచందనం, పాలు, తేనె ఫేస్ ప్యాక్
ఎర్ర చందనం పొడిలో రెండు టేబుల్ స్పూన్ పాలు, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో  శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

Big Stories

Advertisement
×