BigTV English

Porphyria: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

Porphyria: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

Vampire Disease: ఆహారంలో రోజూ వెల్లుల్లిని భాగం చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ కావడంతో పాటు గుండె, కాలేయ సమస్యలు మాయం అవుతాయి. అధికర బరువు అదుపులోకి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. కానీ, అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన ఫీనిక్స్ నైటింగేల్ అనే 32 ఏళ్ల మహిళకు అదే వెల్లుల్లి ప్రాణాతకంగా మారింది. వెల్లల్లి తింటే ప్రాణాలు పోయే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇంతకీ ఫీనిక్స్ కు సోకిన వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


పోర్ఫిరియాతో బాధపడుతున్న ఫీనిక్స్

ఫీనిక్స్ నైటింగేల్ కు  పోర్ఫిరియా అనే అరుదైన వ్యాధి సోకింది. ఈమె సల్ఫర్ తో కూడిని ఏ పదార్థం తీసుకున్నా ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. వెల్లుల్లి లాంటి సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో ఆమె ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వైద్యులు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


వాంపైర్ డిసీజ్ అంటే ఏంటి?

అక్యూట్ ఇంటర్‌మిటెంట్ పోర్ఫిరియా (AIP)ను సాధారణంగా రక్త పిశాచ వ్యాధి అని పిలుస్తారు.  ఇది ఒక అరుదైన జన్యు జీవక్రియ రుగ్మత. ఆక్సిజన్‌ ను మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌ కీలకపాత్ర పోషిస్తున్నది. హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పోర్ఫిరిన్లు రసాయన చర్యలకు గురి కావడం వల్ల AIP ఏర్పడుతుంది. ఈ వ్యాధి నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మైగ్రేన్ సమస్యతో పాటు మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సూర్యరశ్మి తగిలినా తట్టుకోలేదు.

వెల్లుల్లితో ప్రాణాలకే ప్రమాదం

పోర్ఫిరియా వ్యాధి ఉన్నవాళ్లకు సల్ఫర్ అలెర్జీ ఉంటుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అందుకే, నైటింగేల్‌  భోజనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమె వెల్లుల్లి  మాత్రమే కాదు, రెడ్ గ్రేప్స్,  సోయా, ఆల్కహాల్, కాఫీతో సహా పలు రకాల ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. చిన్న వెల్లుల్లి ముక్క తిన్నా కడుపునొప్పి, వాంతులు కలుగుతాయి. ఆమె కొన్ని ఆహారా పదార్థాలను మాత్రమే తింటుందని క్వీన్స్ యూనివర్శిటీలోని పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైఖేల్ హెఫెరాన్ వెల్లడించారు. ఇలాంటి సమస్య ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంటుందని ఆయన వెల్లడించారు.

వాంపైర్ వ్యాధికి చికిత్స

అత్యంత ప్రమాదకరమైన పోర్ఫిరియాకు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏదీ లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు కలిగే ఆయా లక్షణాలను బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆమె తీసుకున్న ఫుడ్స్ కారణంగా 480కి పైగా సందర్భాల్లో ఆమె హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందన్నారు. ఆమెకు 2023లో పోర్ఫిరియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆమె ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read Also: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×