BigTV English

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

IRCTC’s Current Booking Facility: పండుగ సీజన్ లో చాలా మంది సిటీల నుంచి తమ సొంతూళ్లు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా జాలీగా పండుగ చేసుకోవాలని భావిస్తారు. ఈ సమయంలో రైలు టికెట్ దొరకడం అనేది అంత ఈజీ కాదు. చాలా మంది టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాదు. మరికొంత మంది తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తారు. అక్కడ కూడా టికెట్ దొరక్కపోతే. చివరి ఛాన్స్ మరొకటి ఉంటుంది. రైలు బయల్దేరడానికి కాసేపు ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


‘కరెంట్ టికెట్ సిస్టమ్’తో బయల్దేరే ముందు టికెట్ బుకింగ్

వాస్తవానికి రైలు బయల్దేరడానికి మూడు నెలల ముందు నుంచే టికెట్ బుకింగ్స్ మొదలవుతాయి. ఆ టికెట్లను బుక్ చేసుకోలేకపోతే, లేదంటే చివరి క్షణంలో ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు రైలు బయల్దేరడానికి ఒకరోజు ముందు కల్పిస్తారు. ఇక్కడ కూడా అందరికీ కన్ఫామ్ టికెట్ లభించదు. అలాంటి సందర్భంలో ‘కరెంట్ టికెట్ సిస్టమ్’ ను ప్రయత్నించుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా ప్యాసెంజర్ల చార్ట్ రెడీ అయిన తర్వాత కూడా టికెట్ పొందే అవకాశం కల్పిస్తుంది. అంటే.. చార్ట్ రెడీ అయిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.


‘కరెంట్ టికెట్ సిస్టమ్’ ద్వారా టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

IRCTC యాప్ లేదంటే IRCTC వెబ్‌ సైట్ ద్వారా ఈ టికెట్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

1.ముందు మీ డీటైల్స్ లో IRCTC వెబ్ సైట్ లేదంటే IRCTC యాప్ లో లాగిన్ కావాలి.

2.‘ట్రైన్’ బటన్‌పై క్లిక్ చేసి, మీ గమ్యస్థానంతో పాటు ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలను ఎంటర్ చేయాలి.

3.మీ డీటైల్స్ ఎంటర్ చేసిన తర్వాత ‘SEARCH TRAINS’ బటన్‌ పై క్లిక్ చేయాలి.

4.వెంటనే మీరు సెలెక్ట్ చేసుకున్న రూట్లలో అందుబాటులో ఉన్న రైళ్ల లిస్ట్ కనిపిస్తుంది.

5.CC, EC, 3AC, 3Eలో ఖాళీగా ఉన్న బెర్త్ ల వివరాలు కనిపిస్తాయి. వెంటనే మీకు నచ్చిన బెర్త్ క్లిక్ చే ను బుక్  చేసుకోవచ్చు.

‘కరెంట్ టికెట్ సిస్టమ్’ గురించి..

‘కరెంట్ టికెట్ సిస్టమ్’ గురించి IRCTC వెబ్‌ సైట్‌ లో కీలక విషయాలు వెల్లడించింది. “అందరు వినియోగదారులకు ‘కరెంట్ టికెట్ సిస్టమ్’ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ-టికెట్ బుకింగ్ మాత్రమే అనుమతించబడుతుంది. కరెంట్ బుకింగ్ సమయంలో కన్ఫామ్ అయిన  టిక్కెట్లు మాత్రమే బుక్ చేయబడతాయి. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు  రాయితీలు ఉంటాయి. ప్రస్తుత బుకింగ్ PNR కోసం బోర్డింగ్ పాయింట్ ఛేంజ్ అనేది అనుమతించబడదు. కరెంట్ బుకింలో PNR కోసం పేరు, వయస్సు, జండర్ మార్పులకు అవకాశం ఉండదు. ప్రీమియం, సువిధ రైళ్లలో బుకింగ్ లాస్ట్ బుకింగ్ ఛార్జీతో అనుమతించబడుతుంది” అని వెల్లడించింది.

Read Also: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×