BigTV English

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Jio Bharat V3 And V4 : భారతీ మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్లో రిలయన్స్ తన 4G ఫోన్స్ జియో భారత్ V3, V4 ఫోన్స్ ను ఆవిష్కరించింది. ఈ పరికరాలు భారత్లోని 2G వినియోగదారులకు 4G సేవలను తేలికగా అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. ఇందులో యూపీఐ చెల్లింపుల కోసం జియో పే, లైవ్ టీవీ, స్ట్రీమింగ్ నిర్దిష్ట రీసెర్చ్ ప్లాన్ తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ సహా పలు జియో సేవలను అందించనున్నారు.


గ్రాండ్ గా జరిగిన భారతి మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్లో ప్రముఖ రిలయన్స్ కంపెనీ జియో భారత్ V3, V4n ఫోన్స్ ను ప్రారంభించింది. వీటి ప్రారంభ ధర రూ. 1099గా నిర్దేశించింది. ఇక ఈ కొత్త ఫీచర్ ఫోన్స్ త్వరలో అమెజాన్, జియో మార్ట్ తో పాటు రిటైల్ ఔట్లెట్లో సైతం దొరుకుతాయని తెలిపింది. వినియోగదారులు ప్రిపేయిడ్ ని ఎంచుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 14GB డేటాను పొందవచ్చు అని చెప్పుకొచ్చింది.

గత ఏడాది ప్రారంభించిన జియో భారత్ v2 సక్సెస్ కావడంతో ఈ ఏడాది జియో భారత్ v3, v4 మెుబైల్స్ ను రిలయన్స్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్స్ ను లేటెస్ట్ అప్డేట్స్ తో అందిస్తుంది. రెండు ఫోన్స్ 1000 mah బ్యాటరీ, 128GB వరకు ఎక్స్పాండ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇక 23 భారతీయ భాషలకు ఇవి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. జియో టీవీ యాప్స్ కు యాక్సెస్ ను కూడా కలిగి ఉంటాయి. ఇందులో వినోదంతో పాటు పిల్లల ప్రోగ్రామింగ్ వార్తలు వంటి వివిధ వర్గాలలో 45 కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ను ప్రచారం చేయటానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అదనంగా వినియోగదారులు ఈ ఫోన్ ద్వారా జియో సినిమాలో అందుబాటులో ఉన్న పలు షోస్, ఫిల్మ్స్, లైబ్రరీని సైతం యాక్సెస్ చేయవచ్చు.


ALSO READ : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

జియో చాట్ యాప్ – జియో చాట్ యాప్ ని జియో భారత్ v3, v4లో చేర్చడం మరో ముఖ్యమైన ముందడుగు అని చెప్పాలి. ఇక ఇది అపరిమిత వాయిస్, మెసేజ్, ఫోటో షేరింగ్, గ్రూప్ మెసేజ్ ఆప్షన్స్ ద్వారా కనెక్ట్ కావటానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. వీటన్నిటినీ ఏకీకరణ చేయటానికి వినియోగదారులు వద్ద ఒక సమగ్ర కమ్యూనికేషన్ సాధనాన్ని ఉండేలా జియో ముందస్తు ప్రణాళిక రచిస్తోంది.

అదనపు ఫీచర్లు – రిలయన్స్ జియో నుంచి వచ్చిన తాజా ఫోన్స్ ఫోన్ పే యాప్ ను సైతం సపోర్ట్ చేస్తున్నాయి. ఈ యాప్ లావాదేవీలను చదివి వినిపించే ఇన్బిల్ట్ సౌండ్ బాక్స్ స్పీకర్ తో పాటు యూపీఐ ఇంటిగ్రేషన్ సదుపాయం అందిస్తుంది. ఇక ఈ సదుపాయంతో వినియోగదారులు మరింత తేలికగా లావాదేవీలను జరిపే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా వినియోగదారులు ఎంతో తేలికగా అన్ని ఫీచర్స్ ను ఉపయోగించగలిగే మొబైల్ పరిష్కారాలను రిలయన్స్ జియో అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. జియో భారత్ జియో భారత్ v3, v4 లలో సాంకేతిక అప్డేట్ తో పాటు ధర సైతం అనుకూలంగా ఉండటంతో వినియోగదారుల్ని తేలికగా ఆకర్షిస్తాయని రిలయన్స్ యో చెప్పుకొస్తుంది.

Related News

AI Browsers Track Data: మీ పేరు, అడ్రస్, హిస్టరీ అన్నీ ట్రాక్ చేస్తున్న బ్రౌజర్లు.. జాబితాలో గూగుల్ క్రోమ్ టాప్

Netflix Elon Musk: ఎలన్ మస్క్ ట్వీట్‌‌ దెబ్బ.. భారీ సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ రద్దు

Smartphone Comparison: ఐఫోన్ 17 ప్రో vs పిక్సెల్ 10 ప్రో vs షావోమీ 15 అల్ట్రా.. ఏది బెస్ట్?

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Big Stories

×