E-Paper
Advertisement

Rice Water For Skin: రైస్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం

Rice Water For Skin: రైస్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం
Advertisement

Rice Water For Skin: ప్రస్తుతం చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలతో పడరాని పాట్లు పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటితో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా వంటింట్లో ఉన్న పదార్థాలతో కూడా ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.

బియ్యం నీరు ముఖాన్ని అందంగా మారుస్తుంది. దీనిని చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. మరి బియ్యం నీరు చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఇప్పుడతు తెలుసుకుందాం.

Advertisement

రైస్ వాటర్ తో ఫేస్ ప్యాక్స్..

బియ్యం,తేనె ఫేస్ ప్యాక్: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బియ్యం నీటిని వేసి ఒక టీ స్పూన్ తేనెను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. దీనిని 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.

Advertisement

బియ్యం నీరు ,పెరుగు ఫేస్ ప్యాక్: ముందుగా ఒక బౌల్‌లో టేబుల్ స్పూన్ బియ్యం నీరు తీసుకుని దీనిలోనే టేబుల్ స్పూన్ పెరుగును కలపండి. దీనిని పేస్ట్ లాగా చేసుకుని దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగేయండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

బియ్యం నీరు, పసుపు ఫేస్ ప్యాక్: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం నీటిని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు కలపండి. దీనిని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పట్టించండి. ఈ ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

బియ్యం నీరు, ముల్తానీ మిట్టి పేస్ ప్యాక్: ముందుగా ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకుని అందులో 1 టీ స్పూన్ రైస్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయండి. ఆ తర్వాత దీనిని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేయండి. ఆ తర్వాత దీనిని 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మెరుస్తూ ఉంటుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి వాడటం వల్ల చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.

Also Read: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

రైస్ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు..

చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి: రైస్ వాటర్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది.

ముడతలను తగ్గిస్తుంది: ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: బియ్యం నీరు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను మూసివేస్తుంది. ఇది ఎర్రబడిన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మొటిమలను తగ్గిస్తుంది: రైస్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×