BigTV English

Harsha Sai: ఆరోపణలపై స్పందించిన యూట్యూబర్ హర్ష సాయి.. ఏమన్నారంటే..?

Harsha Sai: ఆరోపణలపై స్పందించిన యూట్యూబర్ హర్ష సాయి.. ఏమన్నారంటే..?

Harsha Sai.. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai).. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను లైంగికంగా మోసం చేశాడని, ఈ విషయం బయట పెట్టకుండా వీడియోలతో, ఫోటోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ.. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈమె కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పాపులర్ యూట్యూబర్ గా పేరు సొంతం చేసుకున్న హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. తాజాగా దీనిపై హర్ష సాయి స్పందిస్తూ.. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెడుతూ థంబ్ నైయిల్ పోస్ట్ గా పెట్టాడు.


ఆరోపణలపై స్పందించిన హర్ష సాయి..

Harsha Sai: YouTuber Harsha Sai responded to the allegations.. What did he say..?
Harsha Sai: YouTuber Harsha Sai responded to the allegations.. What did he say..?

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై హర్ష సాయి స్పందిస్తూ.. నాపై చేసిన కామెంట్స్ అన్నీ కూడా అబద్ధాలే. అదనపు డబ్బు కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఇవి. నా గురించి మీకు బాగా తెలుసు. నిజాలు అన్నీ కూడా త్వరలోనే బయటకి వస్తాయి.. అన్ని విషయాలు కూడా మా లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడుతారు అంటూ ఒక పోస్ట్ చేశాడు హర్ష సాయి . ప్రస్తుతం ఈ పోస్ట్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు..

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయినా ఒక నటి యూట్యూబర్ హర్షసాయి పై లైంగిక ఆరోపణలు చేసింది.. తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని, లైంగికంగా తనపై అత్యాచారం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. తనను లైంగికంగా అత్యాచారం చేయడమే కాకుండా తనను వాడుకొని, ప్రైవేట్ గా తీసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో వాపోయింది. అంతేకాదు హర్ష సాయి తండ్రిపై కూడా ఈమె కంప్లైంట్ చేసింది. తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు అని, తనకు ఎలాగైనా న్యాయం జరగాలి అంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో తన బాధను వెళ్ళబుచ్చుకుంది. దీంతో ఆమె కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు యూట్యూబర్ హర్ష సాయిపై సెక్షన్ 376 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు . ప్రస్తుతం విచారణ చేపట్టిన పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు వార్తలు రాగా ఇప్పుడు ఆయన తొలిసారి తనపై వస్తున్న లైంగిక ఆరోపణల పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న హర్షసాయి పై ఇలాంటి లైంగిక ఆరోపణలు రావడం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తోంది.

పాన్ ఇండియా హీరోగా హర్ష సాయి..

తాజాగా యూట్యూబ్లో డబ్బులు వెదజల్లుతూ భారీ పాపులారిటీ అందుకున్న హర్ష సాయి తాజాగా పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈయన నటిస్తున్న సినిమా నుంచి టీజర్ ని కూడా విడుదల చేశారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×