Jamun Seeds: నేరేడు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌గా ప్రకటించారు. నేరేడు పండ్లు ఎంత ప్రయోజనకరమో.. వాటి విత్తనాలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది నేరేడు విత్తనాలను పనికిరానివిగా భావించి వాటిని పారేస్తారు. కానీ ఈ విత్తనాలలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించ గలుగుతాయి. నేరేడు గింజల్లో.. మధుమేహం, జీర్ణక్రియ, చర్మం, కిడ్నీ సమస్యలను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని హోం రెమెడీస్‌గా ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు గింజలతో ఈ సమస్యలను తొలగిస్తాయి:
డయాబెటిస్‌కు ప్రయోజనకరం: నేరేడు గింజలలో లభించే ప్రత్యేకమైన సమ్మేళనం జాములిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా సమతుల్య గ్లూకోజ్ స్థాయిలను కూడా నిర్వహిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటితో ఒక టీస్పూన్ జామున్ పొడిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
నేరేడు గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడతాయి. అంతే కాకుండా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం , ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో అర టీస్పూన్ నేరేడు గింజల పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
చర్మం మచ్చలేకుండా, ఆరోగ్యకరంగా మారుతుంది: మొటిమలు, మచ్చలు లేదా చర్మ అలెర్జీలతో బాధపడేవారికి.. నేరేడు గింజల పొడి ఒక దివ్యౌషధం. దీని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్పష్టమైన, ఆరోగ్య కరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయ పడతాయి. ఈ పొడిని రోజ్ వాటర్ లేదా కలబంద జెల్ తో కలిపి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. వారానికి రెండు నుంచి మూడు సార్లు దీనిని ఉపయోగించడం వల్ల మీ రంగు ప్రకాశవంతంగా ఉంటుంది.
Also Read: హెయిర్ స్ట్రెయిట్నర్ ఇలా వాడితే.. జుట్టు ఊడటం ఖాయం !
కిడ్నీలు, కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది: నేరేడు గింజలు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపి, మూత్రపిండాలు, కాలేయాన్ని శుభ్ర పరుస్తాయి. అవి సహజ నిర్విషీకరణ ఏజెంట్‌గా పనిచేస్తాయి. అంతే కాకుండా ఇవి అవయవాల పని తీరును మెరుగు పరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి శుభ్ర పడుతుంది. అంతే కాకుండా మీ జీవక్రియ మెరుగుపడుతుంది.
జుట్టును బలపరుస్తుంది: నేరేడు గింజలు చర్మానికి మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అవి తలకు కూడా పోషణనిస్తాయి. అంతే కాకుండా చుండ్రు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. కొబ్బరి నూనెతో కలిపిన నేరేడు గింజల పొడితో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలు బల పడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.