Hair Straightener: అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా హెయిర్ కేర్ కూడా ట్రై చేస్తుంటారు. చాలా మంది ప్రతి రోజూ తమ జుట్టును స్టైల్ చేస్తారు. ట్రెండ్స్ గురించి చెప్పాలంటే.. స్ట్రెయిట్ హెయిర్ ఈ రోజుల్లో ట్రెండ్. కాబట్టి ప్రతి ఒక్కరూ అందమైన, సిల్కీ, స్ట్రెయిట్ హెయిర్ కోసం హెయిర్ స్ట్రెయిట్నర్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇది తక్షణ రూపాన్ని అందిస్తున్నప్పటికీ.. ప్రతి రోజూ లేదా క్రమం తప్పకుండా స్ట్రెయిట్నర్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సరైన రక్షణ లేకుండా స్ట్రెయిట్ చేయడం వల్ల తీవ్ర మైన నష్టం జరుగుతుంది. తరచుగా హెయిర్ స్ట్రెయిట్నర్ ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని నష్టాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ హెయిర్ స్ట్రెయిటనింగ్ వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
జుట్టు పొడిబారడం పెరుగుతుంది:
హీటింగ్ టూల్స్ జుట్టులోని సహజ తేమను తొలగించి, నిస్తేజంగా, పొడిగా మారుస్తాయి. అందుకే.. నిపుణులు ప్రతిరోజూ హెయిర్ స్ట్రెయిట్నర్‌లను ఉపయోగించకూడదని సలహా ఇస్తారు. జుట్టు పొడిగా మారినప్పుడు.. అది వికారంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి.. వాటిని ప్రతిరోజూ వాడకుండా ఉండండి.
జుట్టు రాలడం పెరుగుతుంది:
ప్రతి రోజూ స్ట్రెయిట్నర్ వాడటం వల్ల మీ జుట్టు మూలాలు బలహీనపడతాయి. ఈ బలహీనమైన జుట్టు మూలాలు క్రమంగా జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఇది తరచుగా చివర్లు చిట్లడం వంటి సమస్యకు దారితీస్తుంది. మీ జుట్టు మరింత నిర్జీవంగా కనిపిస్తుంది.
తల చర్మంపై ప్రభావం:
స్ట్రెయిట్నర్ కూడా వేడి చేసే సాధనం. పదే పదే వేడికి గురి కావడం వల్ల తలపై జుట్టు పొడిబారడం వల్ల చికాకు ఏర్పడుతుంది. దీని వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు.. ఈ సమస్యలు చాలా తీవ్రంగా మారతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Also Read: పటికతో డార్క్ సర్కిల్స్‌కి చెక్.. ఒక్కసారి వాడితే బోలెడు బెనిఫిట్స్
జుట్టు రంగు తొలగిపోతుంది:
మీరు కలర్ లేదా డై వాడితే, హెయిర్ స్ట్రెయిట్నర్లు మీ జుట్టు రంగును కోల్పోయేలా చేస్తాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రంగు వేగంగా మసక బారుతుంది. అంతే కాకుండా ఇది మీ జుట్టు యొక్క సహజ ఆకృతిని దెబ్బ తీస్తుంది. ఫలితంగా జుట్టు సహజ రంగును కూడా దెబ్బతింటుంది.
రోజూ హెయిర్ స్ట్రెయిటనింగ్ వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
స్ట్రెయిట్ చేసే ముందు ప్రతిసారీ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే వేయండి.
వారానికి రెండు సార్లు మీ జుట్టును డీప్ కండిషనర్ చేయండి.
మీ జుట్టును సహజంగా ఆరనివ్వండి.
వారానికి 1-2 సార్లు కంటే ఎక్కువ హెయిర్ స్ట్రెయిట్నర్‌ని ఉపయోగించకూడదు.
Also Read: మైక్రో ప్లాస్టిక్‌తో ముప్పు.. మెదడు, ఎముకలపై ప్రభావం, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు