Beetroot For Skin: దుర్గా పూజకు సన్నాహాలు చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. దేవతను పూజించడంతో పాటు.. అందమైన దుస్తులు ధరించడం, ప్రత్యేకంగా తయారు అవ్వడం వంటివి మరింత ఆకర్షణను పెంచుతాయి. పండగ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. అందరికంటే తాము మరింత కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు.
ఇలాంటి సందర్భంలో రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్‌కు బదులుగా.. నేచురల్ గా ఇంట్లో తయారు చేసే ఫేస్ ప్యాక్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం కోల్పోయిన మెరుపును పునరుద్ధరించడంలో బీట్‌రూట్ గొప్పగా సహాయపడుతుంది.బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌లు మచ్చలను తగ్గించి మీ కాంతిని పెంచడంలో సహాయపడతాయి. ఇంట్లో బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
బీట్‌రూట్ చర్మానికి ఎందుకు మేలు చేస్తుంది ?
బీట్‌రూట్ పోషకాలకు నిలయం: ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ ఆరోగ్యకరమైన, మెరుస్తున్న చర్మాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
సహజ మెరుపు కోసం: బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది- దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి. అంతే కాకుండా మచ్చలను తేలికపరచడంలో సహాయ పడతాయి.
చర్మాన్ని నిర్విషీకరణ చేస్తుంది: బీట్‌రూట్ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయ పడుతుంది. దీని కారణంగా చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలు: దీనిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలను తగ్గించడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
బీట్‌రూట్ ఇన్‌స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
1- చిన్న బీట్‌రూట్
1- టీస్పూన్ శనగ పిండి
1/2- టీస్పూన్ తేనె
1/2 – టీస్పూన్ పెరుగు (పొడి చర్మం కోసం) లేదా నిమ్మరసం (జిడ్డు చర్మం కోసం)
Also Read: పటికతో డార్క్ సర్కిల్స్‌కి చెక్.. ఒక్కసారి వాడితే బోలెడు బెనిఫిట్స్
తయారుచేసే విధానం:
1. ముందుగా బీట్‌రూట్ తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి.
2. ఈ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. పేస్ట్ చిక్కగా ఉంటే, మీరు ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు.
3. ఇప్పుడు ఒక గిన్నెలో.. ఈ బీట్‌రూట్ పేస్ట్‌లో శనగపిండి, తేనె, పెరుగు (లేదా నిమ్మరసం) వేసి బాగా కలిపి మృదువైన పేస్ట్ లా తయారు చేయండి.
4. ఇప్పుడు.. మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత, ఈ ప్యాక్‌ను మీ చర్మానికి సమానంగా అప్లై చేయండి. మీ కళ్ళు, పెదవుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వదిలేయండి.
5. తర్వాత 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ప్యాక్ ఆరిన తర్వాత.. తడి చేతులతో స్క్రబ్ లాగా సున్నితంగా మసాజ్ చేయండి. అనంతరం మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
6. మీరు ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
మీకు సున్నితమైన చర్మం ఉంటే.. ఈ ప్యాక్ వేసుకునే ముందు మీ మోచేయిపై పరీక్షించండి. బీట్‌రూట్ రంగు మీ చర్మంపై కొంతకాలం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట దీన్ని అప్లై చేయడం మంచిది.