BigTV English

Unfaithful Spouse : భార్యాభర్తల మధ్య బంధం బలహీన పడడానికి ఇవే కారణాలు

Unfaithful Spouse | దంపతులైనా, ప్రేమికులైనా వారి మధ్య ఉన్న బంధం బలంగా ఉండాలంటే ఇరువురి మధ్య సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం, ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

Unfaithful Spouse : భార్యాభర్తల మధ్య బంధం బలహీన పడడానికి ఇవే కారణాలు

Unfaithful Spouse | దంపతులైనా, ప్రేమికులైనా వారి మధ్య ఉన్న బంధం బలంగా ఉండాలంటే ఇరువురి మధ్య సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం, ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు క్లిష్ట పరిస్థితులలో ఉంటే మరొకరు తోడుగా నిలవాలి.


అలా కాకుండా అపార్థాలు పెరిగిపోయి.. నువ్వు చెప్తే నేను వినేదేంటి? అన్నట్లు ఉంటే ఆ బంధం బలహీనం కావడం ప్రారంభం అవుతుంది. క్రమంగా ఆ బంధంలోకి మూడో వ్యక్తి వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఇంకొకరికి దగ్గరవుతున్నారు అనే విషయాన్ని మరొకరు ఎదుటి వ్యక్తి చేసే కొన్ని పనుల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి ఇక తనతో నమ్మకంగా లేదు అని సూచించే అయిదు సంకేతాలు ఇవే..

తరుచూ కారణం లేకుండా గొడవ పడడం :
రోజూ ఏదో ఒక విషయంలో మీతో గొడవ పెట్టుకుని మీకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఇక మీ వారు కాకపోవచ్చు. మీ తప్పు ఉన్నా లేకపోయినా, ప్రతి చిన్న విషయానికీ మిమ్మల్నే ఎత్తి చూపిస్తారు. అసలు ఇది గొడవ పడేంత విషయమా? అని మీకు కొన్ని సార్లు అనిపిస్తుంటుంది. వారు పక్కనుంటే మీకు నిమిషాలు గంటల్లా గడవడం మొదలవుతుంది.


ఇంట్లో ఉన్నా ఎక్కువగా ఫోన్‌లో ఉండటం :
మన భాగస్వామి ఇదువరకటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా ఫోన్‌లో గడుపుతున్నట్లు కనిపిస్తుంటారు. ఎక్కువగా చాటింగ్‌ చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటారు. ఇంట్లోనే ఉంటూ గది తలుపులు పెట్టుకుని ఈ పనులు చేస్తుంటారు. బాత్రూమ్‌లోకి ఫోన్‌ని పట్టుకెళ్లి గంటల తరబడి అందులోనే ఉంటారు. ఫోన్‌ని మనకు అందకుండా చూసుకుంటారు. ఫోన్లో పాస్‌వర్డ్‌లు పెడతారు.

భాగస్వామి ఇష్టా ఇష్టాల గురించి పట్టించుకోకపోవడం :
మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీ ఇష్టానుసారం ఏమైనా చేయాల్సి ఉందా? అనే విషయాన్ని అస్సలు లెక్కలోకి తీసుకోరు. వారు చేయాలనుకున్న దాన్ని చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని అడగడం గాని, చెప్పడం గాని చెయ్యరు. నీతో నాకు లెక్కేంటి అన్నట్లుగా మసలుకోవడం ప్రారంభిస్తారు.

శారీరకంగా దూరం కావడం :
మీతో శారీరకంగా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ దగ్గరగా మసలుకున్నా అక్కడ కూడా మీలో లోపాల్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఇలా లేవు. అలా లేవు. అంటూ బాడీ షేమింగ్‌ చేస్తారు. వేరొకరు అందంగా ఉన్నారని చెబుతూ హేళన చేస్తుంటారు.

మిమ్మల్ని శారీరకంగా హింసించడం :
మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని హింసించేందుకు ప్రయత్నిస్తారు. ఏం చేస్తే మీరు వారి నుంచి దూరంగా వెళ్లిపోతారో ఆ పనులన్నింటినీ చేసేందుకు చూస్తారు. ఈ ఐదు సూచనలు కనిపిస్తుంటే మాత్రం ఆ వ్యక్తి ఇక మీ వారు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

పై సంకేతాలు కనిపిస్తే మీరు జీవతంలో భాగస్వామి గురించి సీరియస్‌‌గా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లేనని భావించాలి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×