IND VS PAK, Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఒకే ఒక్కటి మిగిలి ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రేపు అంటే ఆదివారం రోజున జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో… రెండు జట్లు కసరత్తులు ప్రారంభించాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టుతో జరిగే ఫైనల్ కంటే ముందు టీమిండియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల పాలు అయినట్లు చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరో కాదు హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరూ గాయపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరూ ఫైనల్ మ్యాచ్ ఆడబోరని కూడా చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ముందు.. అభిషేక్ శర్మ, హర్ధిక్ పాండ్యాకు గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు… పాకిస్తాన్ తో జరిగే ఫైనల్స్ కు దూరం కాబోతున్నారని అంటున్నారు. నిన్న శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా ఒకే ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేయలేదు. అతనికి గాయం అయిన నేపథ్యలో నిన్న బౌలింగ్ చేయలేదట. దీని వల్ల.. నిన్న శ్రీలంక గెలిచినంత పని చేసింది. అదే నిన్న హర్ధిక్ పాండ్యా బౌలింగ్ చేసి ఉంటే..శ్రీలంక తొందరగానే ప్యాకెప్ అయ్యేదని అంటున్నారు. ఇక అటు అభిషేక్ శర్మ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ ఓవర్ సమయంలో… అతడు బ్యాటింగ్ కు రాకపోవడానికి అదే కారణమంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఒక వేళ హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్స్ ఆడకపోతే… సూర్య కుమార్ యాదవ్ సేనకు ఊహించని షాక్ తగిలే ప్రమాదం ఉంది. వాళ్ళ స్థానాలు భర్తీ చేయడం అసాధ్యం. అయినా కూడా హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ తప్పుకుంటే… జితేశ్ శర్మ లేదా రింకూ సింగ్ అభిషేక్ శర్మ స్థానం భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే.. పాండ్యా స్థానంలో.. హర్శిత్ రాణా అలాగే ఉంటాడు. అటు శివం దూబే జట్టులోకి వస్తాడు.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే !
🚨 INJURY UPDATES OF TEAM INDIA 🚨
– Abhishek Sharma is fine.
– Hardik Pandya will be assessed today.Two Important players for the final. 🤞 pic.twitter.com/zeLplh11ZS
— Johns. (@CricCrazyJohns) September 27, 2025