BigTV English

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

Allu Arjun:  అల్లు – మెగా కుటుంబాల మధ్య ఉన్న వైరం కాస్తా.. అల్లు కనకరత్నం మరణంతో తొలగిపోయింది. ఆమె మరణం.. ఈ రెండు కుటుంబాలను కలిపింది. మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు కుటుంబానికి సపోర్ట్ గా నిలిచారు. చివరికి పవన్ కళ్యాణ్ సైతం అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని.. బన్నీని వారి కుటుంబాన్ని ఓదార్చాడు. ఇక పాత గొడవలు అన్ని మర్చిపోయి ఇరు కుటుంబాల మధ్య మాటలు కలిశాయని, ప్రస్తుతం రాకపోకలు కూడా జరుగుతున్నాయని టాక్.


ఇక తాజాగా అల్లు అర్జున్.. తన కుటుంబంతో కలిసి ఈ మధ్యనే ఓజీ సినిమా చూసాడు. తన AAA థియేటర్ లో కాకుండా ఏఎంబి మాల్ లో అల్లు అర్జున్ ఓజీ సినిమాను  వీక్షించడం జరిగింది. సినిమా చూసి బన్నీ బాగానే ఎంజాయ్ చేసినట్లు కూడా సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్.. సినిమా పిచ్చోడు. నచ్చిన సినిమా ఏదైనా.. తన మనసులో మాటను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. చిన్నోళ్ళయినా.. పెద్దోళ్ళయినా కూడా వారిని ప్రశంసించడంలో మొహమాటపడడు. కానీ, ఓజీ విషయంలో బన్నీ ఆగాడు.  సినిమా చూసిన వెంటనే రివ్యూ చెప్పే బన్నీ.. ఇప్పటివరకు ఓజీ గురించి ఒక్క మాట చెప్పలేదు.


ఇక దీంతో ఫ్యాన్స్ అందరూ.. ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా బన్నీ రివ్యూ ఇస్తాడా.. ? లేక వదిలేస్తాడా.. ? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సినిమా చూడలేదు అంటే ఓకే కానీ, చూసి కూడా మాట్లాడలేదు అంటే ఇంకా కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. బన్నీ కావాలనే ఈ రివ్యూ చెప్పడం లేదా.. ? అంటే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదా ..? అని మాట్లాడుకుంటున్నారు.

ఇంకోపక్క బన్నీ ఫ్యాన్స్.. పవన్ ఫ్యాన్స్ మధ్య  గొడవలు మొదలయ్యాయి. పుష్ప 2 మొదటి డే కలక్షన్స్ ను ఓజీ దాటలేకపోయిందని, అది బన్నీ రేంజ్ అని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రమోషన్స్ చేసి, టికెట్ రేట్స్ పెంచితే అంత వచ్చాయి. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఓజీ రిలీజ్ అయ్యి ఈ రేంజ్ కలక్షన్స్ అందుకోవడం గ్రేట్ అని పవన్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.నేటి నుంచి ఓజీ నార్మల్ టికెట్ రేట్స్ తోనే థియేటర్ లో కొనసాగుతుంది. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి కలక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

Ameesha Patel: ఆ హీరో ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపాలని ఉంది

The Paradise: షికంజా మాలిక్ గా మోహన్ బాబు.. ఏం లుక్ రా బాబు.. నెక్స్ట్ లెవెల్ అంతే

Allu sirish: పెళ్లి పీటలెక్కుతున్న అల్లు హీరో.. అమ్మాయి ఎవరంటే..?

Big Stories

×