Hyderabad Floods: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులు, పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ప్రజల కష్టకాలంలో వారితో పాటు నిలవడం మన అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ తన అభిమానులకు, జనసేన తెలంగాణ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. “హైదరాబాద్‌లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మనం అండగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వరద నియంత్రణ, సహాయక చర్యల్లో నిమగ్నమైందని పవన్ గుర్తుచేశారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని మూసీ నది ఉప్పొంగిపోవడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్, చుట్టుపక్కల కాలనీలు, లో లెవెల్ ఏరియాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాహన రాకపోకలు తీవ్రంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ హెచ్చరించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.