Ameesha Patel: సాధారణ ప్రజలకే తమ ఫేవరేట్ హీరోలు, క్రష్ లు ఉంటారా.. ? అంటే కాదు అది తప్పు. సెలబ్రిటీలు కూడా మనుషులే. వారికి కూడా ఇష్టాలు, వారికీ నచ్చిన సినిమాలు.. వారికీ నచ్చిన హీరోలు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు వారికి నచ్చిన క్రష్ లు కూడా ఉంటారు. తమతో కలిసి నటించినవారు కానీ, వేరే ఇతర హీరోలు కానీ.. క్రష్ అనే ఫీలింగ్ కచ్చితంగా ఉంటుంది. అందులో నేను కూడా అతీతమేమి కాదు అంటుంది అందాల భామ అమీషా పటేల్.
బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత టాలీవుడ్ ను ఏలుదామనుకుంది కానీ, కుదరలేదు. దీంతో బాలీవుడ్ లోనే తన సత్తా చాటుకుంది. ఇక అన్ని బావుంటే అది జీవితం ఎందుకు అవుతుంది. అలాగే ఈ చిన్నదాని జీవితంలో కూడా వివాదాలే ఎక్కువ అయ్యాయి. అయినా అవేమో పట్టించుకోకుండా సింగిల్ గానే పోరాడుతూ వస్తుంది.
గదర్ 2 తరువాత అమీషా రేంజ్ మారిపోయింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ, అమీషా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా అమ్మడు ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. అందులో ఆమె తన మనోగతాన్నీ బయటపెట్టింది. ప్రేమ, పెళ్లి, క్రష్ ఇలా ఎన్నో విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంది.
మొట్ట మొదటిసారి అమీషా తన క్రష్ ఎవరో చెప్పుకొచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ తమ క్రష్ ల గురించి బయటపెట్టరు. అది ఇంత బోల్డ్ గా అయితే ఎవరు చెప్పరేమో. కానీ, అమీషా మాత్రం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తన మనసులోని మాటలను బయటపెట్టింది. తన క్రష్ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ అని అమీషా బయటపెట్టింది.
” ఎప్పటికీ టామ్ క్రూజ్ నే నా క్రష్. ఆయనను నేను అంత అభిమానిస్తున్నా. ఆయన ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపడానికి కూడా నేను సిద్దమే. నాకు అవకాశం వస్తే ఆయనను పెళ్లి చేసుకుంటాను కూడా. అంత పిచ్చి. చిన్నతనం నుంచి టామ్ అంటే ఎనలేని అభిమానం. నా పెన్సిల్ బాక్స్ నుంచి ఇంట్లో ప్రతి గోడపై ఆయన ఫొటోలే ఉండేవి. ఛాన్స్ వస్తే ఆయన నటించే సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన చేస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.