OG Child Artist:సాధారణంగా కొన్ని కొన్ని చిత్రాలు చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరికొన్ని చిత్రాలు చైల్డ్ ఆర్టిస్టులను బేస్ చేసుకుని సక్సెస్ కొట్టినవి కూడా ఉన్నాయి. అయితే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు సినిమాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనిపించేది కొంతసేపే అయినా అతని పాత్రలతో అందరినీ అబ్బురపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఓజీ. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ బాగానే వసూలు చేసింది. కానీ ఇప్పుడు పెద్దగా థియేటర్లకు ఆడియన్స్ వెళ్లలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓజీ కూతురిగా కనిపించి తన పెర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకుంది ఒక చైల్డ్ ఆర్టిస్ట్. దీంతో ఈ అమ్మాయి ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏం చేసేది ? ఇలా కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమాలలో ఎక్కువగా తండ్రి పాత్రలు పోషించరు. గతంలో ఖుషీ సినిమా క్లైమాక్స్ లో మాత్రమే ఒక నిమిషం పాటు పిల్లలకు తండ్రిగా కనిపించిన ఈయన.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఓజీ సినిమాలో తండ్రి పాత్ర పోషించారు. అయితే ఇక్కడ సెకండ్ ఆఫ్ మొత్తం తండ్రిగానే కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఈమె పేరు ? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇకపోతే సెకండ్ ఆఫ్ మొత్తం తండ్రి ఎమోషన్ తోనే నడుస్తుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ కి కూతురుగా ఒక పాప నటించింది. ఆ పాప ఇప్పుడు హైలైట్ గా మారుతోంది. ఆమె పేరు సాయేషా షా (Sayesha shah).. ముంబైకి చెందిన ఈ పాపను ఒక కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. పాప ఇప్పటికే డెటాల్, యూరో కిడ్స్ , సంతూర్, లెన్స్ కార్ట్, టాజెల్ వంటి పలు బ్రాండ్ ప్రమోషన్లలో నటించింది. అంతేకాదు కొన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్ లో కూడా కనిపించింది ఈ చిన్నారి. అలాగే బాలీవుడ్ స్టార్స్ తో నటించిన ఈ చిన్నారి.. మృనాల్ ఠాగూర్ తో కలిసి ఒక రియల్ ఎస్టేట్ యాడ్ కూడా చేసింది.
భారీగా సంపాదిస్తున్న చిన్నారి..
ఇకపోతే ఇన్ని యాడ్ లలో నటిస్తున్న ఈ చిన్నారి.. భారీగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ ఓజి సినిమా ద్వారా కూడా ఈ చిన్నారికి బాగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
మొదటి సినిమానే అయినా అద్భుతమైన ప్రదర్శన..
ఇకపోతే ఈ చిన్నారి సినిమాల విషయానికి వస్తే.. ఈమెకు మొదటి చిత్రం ఇదే అయినప్పటికీ పలు యాడ్స్ లలో నటించిన అనుభవంతోనే ఇందులో చాలా అద్భుతంగా నటించింది.. పవన్ కళ్యాణ్ కి కూతురుగా నటించిన సాయేషా మంచి ఎమోషన్ పండించింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు ఎక్కువగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనతో కలిసి నటించిన అర్జున్ దాస్, రాజ్ తిరందాస్ లతో కలిసి ఫోటోలు దిగగా.. ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. మొత్తానికైతే ఈ చిన్నారి ఇప్పుడు ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మరి మునుముందు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
ALSO READ:Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?