Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి పొడవున కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ నగర్ జలాశయంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అధికారులు జలాశయ గేట్లు తెరిచారు. ఈ క్రమంలో ముసీనది ఉప్పొంగి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా చాదర్ ఘాట్ వంతెన ముసీ ప్రవాహంలో మునిగిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచి పోయాయి. పరిసర ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకున్నారు. జిహెచ్ఎమ్‌సి , రెస్క్యూటీములు అప్రమత్తమై సహాయ చర్యలు చేపడుతున్నారు. పోలీసులు మైక్ సహాయంతో ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం చాదర్ ఘాట్ వంతెనను మూసి వేశారు.