Longevity Youthful Traits| ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ గత సంవత్సరం మరణించింది. ఆమె పేరు మరియా బ్రాన్యాస్ (Maria Branyas). స్పెయిన్ దేశానికి చెందిన ఆమె 117 ఏళ్ల పాటు సుదీర్ఘ జీవనం ఆరోగ్యకరంగా సాగించింది. ఆమె అంతకాలం ఎలా జీవించిందో? తెలుసుకోవాడానికి శాస్త్రవేత్తలు ఆమె డిఎన్ఏ పై అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె జన్యువులు ఆశ్చర్యకరంగా “యవ్వనంగా” కనిపించాయి.
ఆమె గుండె, మెదడు, రోగనిరోధక వ్యవస్థను రక్షించే అరుదైన జన్యు వైవిధ్యాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధన ద్వారా వృద్ధాప్య రహస్యాలను అన్వేషించి, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుకు సంబంధించిన సూచికలను గుర్తించాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అధ్యయనం జీవిత కాలాన్ని ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వారు భావిస్తున్నారు. మరియా 2024లో మరణించే ముందు ఆమె రక్తం, లాలాజలం నమూనాలను సేకరించారు. ఈ పరిశోధన ఫలితాలు సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు ఎలా అధ్యయనం చేశారు?
మరియా బ్రాన్యాస్ రక్తం, లాలాజలం, మూత్రం, మలం నమూనాలను పరిశోధకులు సేకరించి.. ఆమె డీఎన్‌ఏ ఫినోటైప్‌ను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలించారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ.. ఆమె కణాలు యవ్వనంలో ఉన్న వ్యక్తిలా పనిచేస్తున్నాయి. ఈ అధ్యయనం ఒక వ్యక్తికి సంబంధించినదైనా, వృద్ధాప్య జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
మరియా గుండెను పరీక్షించగా..
మరియా గుండె ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి, అయితే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరీక్షల ఫలితాలు రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తుంది. ఆమె డిఎన్ఏలో సాధారణ వృద్ధాప్య లక్షణాలు లేకపోవడం ఆశ్యర్యకరం.
ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ (వాపు స్థాయిలు) తక్కువ
మరియా శరీరంలో వాపు స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా వృద్ధాప్యంలో వాపు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, కానీ మరియా విషయంలో అలాంటి సూచికలు కనిపించలేదు. ఇది ఆమె దీర్ఘాయుష్షుకు దోహదపడింది.
ఆహారం, జీవనశైలి పాత్ర
మరియా ప్రతిరోజూ తాజా ఆహారాలతో కలిపిన పెరుగు తినేవారు. ఇది ఆమె జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడింది. చదివే అలవాటు ఆమె ఏకాగ్రత, ఆలోచనా శక్తిని మెరుగుపరిచింది. సామాజిక సందర్శనలు ఆమెను చురుకుగా ఉంచాయి. క్రమం తప్పకుండా నడవడం ఆమె శారీరక దృఢత్వాన్ని కాపాడింది. ఈ అలవాట్లు ఆమె జన్యుశాస్త్రాన్ని మెరుగుపరిచాయి.
టెలోమీర్లు, క్యాన్సర్ రక్షణ
మరియా డిఎన్ఏలో టెలోమీర్లు ఊహించిన దానికంటే తక్కువగా కుంచించుకుపోయాయి. టెలోమీర్లు.. క్రోమోజోమ్‌ల మొనలను రక్షించే షూలేస్‌ల వంటివి. సాధారణంగా టెలోమీర్లు తగ్గిపోతే కణాలు త్వరగా వృద్ధాప్యానికి గురవుతాయి, కానీ మరియా విషయంలో అవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడ్డాయి.
రోగనిరోధక వ్యవస్థ, జీర్ణవ్యవస్థ సూచికలు
మరియా రోగనిరోధక వ్యవస్థ 20 ఏళ్ల వ్యక్తిది లాగా పనిచేసింది. ఆమె జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ కూడా 20 ఏళ్ల వ్యక్తితో పోలి ఉంది, ఇది జీర్ణక్రియకు సహాయపడింది. ఈ సూచికలు ఆమె మంచి ఆరోగ్యాన్ని సూచిస్తాయి.
పరిశోధకుల చివరగా ఏం చెబుతున్నారంటే?
అనారోగ్యానికి ముఖ్య కారణం వృద్ధాప్యం కాదని పరిశోధకులు తేల్చారు. మరియా జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహిస్తోంది. ఆమె ఆహార అలావాట్లు, వ్యాయామం, సామాజిక జీవనం దీర్ఘాయుష్షుకు మార్గం చూపాయి.
Also Read: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ చోరీ.. పర్సులో దాచిన అతిథి