E-Paper
Advertisement

White Rice Facts : వైట్‌రైస్ తినడం ఆరోగ్యకరమా..!

White Rice Facts : వైట్‌రైస్ తినడం ఆరోగ్యకరమా..!
Advertisement

White Rice Benefits : వైట్‌రైస్.. మన తెలుగు ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినే రైస్. ఇది తినకుంటే అసలు భోజనం చేసిన అనుభూతే ఉండదు ఎవరికి. ఎటువంటి ఆహారం తిన్నా.. వైట్‌రైస్ ఓ ముద్ద మన కడుపులో పడితే ఆ తృప్తే వేరు. రోజులో ఒక్కసారైనా ఈ వైట్‌రైస్ తింటారు. అయితే వైట్‌రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మనకు కూడా ఆ సంగతి తెలుసు. కానీ వైట్ రైస్ తినడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ప్రపంచంలోనే వైట్‌రైస్ ప్రధాన ఆహారంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ ఆహారంపై అనేక అపోహలు పుట్టుకొచ్చాయి. రైస్‌ను ఎక్కువ పాలిష్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, తక్కువ పోషకాలు ఉంటాయని చెబుతుంటారు. ఇదంతా నిజమే అయినప్పటికీ.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ వైట్‌రైస్‌తో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

Advertisement

వైట్‌రైస్‌లో తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీని కారణంగా సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణం సమస్యలు, ప్రేగుల సమస్యలు ఉన్న వారికి వైట్‌రైస్ ఉత్తమమైన ఎంపిక. బ్రౌన్‌రైస్ ఇతర రైస్‌లు సులభంగా జీర్ణం కావు.

Read More : ఈ బ్రేక్‌‌ఫాస్ట్‌తో బరువు తగ్గండి..!

Advertisement

జీర్ణం సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి వైట్‌రైస్ ఉత్తమమైన ఆహారం. ఎందుకంటే ఇది సహజంగా గ్లూటెన్ రహిత సమ్మేళనం. ఇది జీర్ణవ్యవస్థ ఆహార అణువులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. గోధుమ ఆధారిత ధాన్యాలు, గ్లూటెన్ రిచ్ స్టేపుల్స్ వైట్‌రైస్‌కు ప్రత్యమ్నాయంగా చెబుతారు.

వైట్‌రైస్ బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. వైట్‌రైస్‌లో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ కంటెంట్, క్యాలరీలు బరువు పెరగడానికి సహాయపడతాయి. మీకు బరువు పెరగాలనే ఆలోచన ఉంటే వైట్‌రైస్ డైలీ తీసుకోండి. వైట్ రైస్ వ్యాయామం ముందు లేదా తర్వాత తీసుకోండి. ఇది శరీరంలో గ్లైకోజెన్ నిల్వలను నింపుతుంది. శరీరానికి మంచి శక్తి వనరుగా పనిచేస్తుంది.

Read More : రోజుకో గుడ్డును గుటుక్కున మింగేయండి..!

వైట్‌రైస్ ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అందుకే అన్ని వంటశాలలలో వైట్‌రైస్‌ను ఎక్కువకాలం నిల్వ చేస్తారు. బ్రౌన్‌రైస్, ఇతర తృణధాన్యాలు ఎక్కువకాలం నిల్వ ఉండవు. ఇతర ధాన్యాలలో యాసిడ్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వైట్‌రైస్‌లో ఇవి తక్కువగా ఉంటాయి. వైట్‌రైస్ మిల్లింగ్ చేసినప్పుడు యాంటీ న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. వైట్‌రైస్ మంచిదే అయినప్పటికీ.. ఎక్కువ మొత్తంలో తినడం మాత్రం మంచిది కాదు. ప్రతి రోజూ వైట్ రైస్ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×