Big Stories

Weight Loss Breakfast: అధిక బరువు సమస్ఈయలా..? ఈ బ్రేక్‌‌ఫాస్ట్‌తో తగ్గండి..!

Weight Loss Tips: అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ యుగంలో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు కారణంగా చాలా మంది వయసుతో సంబంధం లేకుంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మీకు తెలుసా ఉదయం మనం తీసుకునే ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు కదా.. పెరిగే అవకాశాలే ఎక్కువ.

- Advertisement -

మన డే స్టార్ట్ చేయడానికి బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. ఉదయాన్నే తీసుకునే ఆహారం మనం రోజంతా తాజాగా ,ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేయడానికి బదులుగా ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఆ రోజుకు శక్తిని అందిస్తుంది.

- Advertisement -

Read More: కొబ్బరి పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా..?

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఫలితంగా ఎక్కువ తింటారు. దీని కారణంగా బరువు పెరిగే అశకాశం ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగకుండ మనం ఆహారంలో తీసుకోవాల్సినవి ఏంటో తెలుసుకుందాం.

ఓట్స్ బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఓట్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను కూడా అందిస్తుంది. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.

చాలా మంది సాంబార్ ఇడ్లీని చాలా ఇష్టంగా తింటుంటారు. ఇది కేవలం రుచినే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్. మినరల్స్ నిండుగా ఉంటాయి. ఇడ్లీ కూడా సులభంగా జీర్ణం అవుతుంది. సాంబార్‌లో కూరగాయలు చేర్చడం వల్ల మరింత ఆరోగ్యంగా మారుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో పప్పులు ఉండేలా చూసుకోండి. పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్లు, కాల్షియం, పీచు పదార్థాలు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అతిగా తినకుండా కడుపును నిండుగా చేస్తాయి.

Read More: కడుపులో క్రిములా..?

గుడ్లతో సులభంగా బరువు తగ్గొచ్చు. వీటిలో ఉండే ప్రొటీన్లు పొట్టను నిండుగా ఉంచుతాయి. ప్రతి రోజూ అల్పాహారంలో ఉడికించిన గుడ్లను తీసుకోండి. ఎగ్ ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీని కూడా తినండి. నూనెను మాత్రం ఎక్కువగా వాడొద్దు. ఇది బరువును పెంచుతుంది.

మీరు బరువు తగ్గాలంటే పన్నీర్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి. పన్నీర్‌లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో పన్నీర్ శాండ్‌విచ్ లేదా పన్నీర్ బుర్జీని చేర్చుకోండి. పన్నీర్ వల్ల అనేక ఆరోగ్యకరమైన లాభాలు పొందవచ్చు. ఇది బరువును తగ్గించడంతో పాటు మీ శరీరానికి శక్తిని అందిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News