E-Paper
Advertisement

Eggs Health Benefits: రోజుకో గుడ్డును గుటుక్కున మింగేయండి..!

Eggs Health Benefits: రోజుకో గుడ్డును గుటుక్కున మింగేయండి..!
Eggs Health Benefits

Eggs Health Benefits:

మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తీసుకునే ఆహారంలో మంచి పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి? మన శరీరానికి అవి ఏ విధంగా ఉపయోగ పడతాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే ఆహారంలో కోడి గుడ్డును ఒక భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నట్లయితే మధ్యాహ్నం భోజనంలో వారానికి రెండు సార్లు ఉడికించిన గుడ్లు ఇచ్చేవారు. పిల్లలలో పోషకాహారలోపం రాకుండా ప్రభుత్వం ఈ ఉడికించిన గుడ్లు ఇచ్చేది. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఉడికించిన గుడ్లను తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉడికించిన గుడ్లలో ఐరన్, జింక్, విటమిన్ ఇ, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి. గుడ్లు రోజూ తీసుకోవడం వల్ల మీ కండరాలు దృఢంగా అవుతాయి. శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శారీరక బలహీనతలు ఉన్నవారు, క్షయవ్యాధి గ్రస్తులు, బాలింతలు, గర్భిణులకు గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలోని తెల్లసొనను ఒక కప్పు పాలలో కలిపి తీసుకుంటే మంచి బలం టానిక్‌లా పనిచేస్తుంది. అలానే ఉడికించిన గుడ్డులోని పచ్చసొనతో ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నరాల బలహీనత ఉన్నవారు కూడా రోజూ ఒక గుడ్డు తింటే మంచిది. రాత్రి పడుకునే ముందు ఉడికించిన గుడ్డులోని పచ్చసొనతో తేనె కలిపి రెండు బాదం పప్పులు ప్రతి రోజూ తీసుకుంటే నరాల బలహీనత నుంచి బయటపడొచ్చు.

మీకు జుట్టు రాలే సమస్య ఉంటే గుడ్డుకు మంచిన మెడిసిన్ లేదు. జట్టు రాలే సమస్యకు గుడ్డు సులభంగా నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. గుడ్లలోని తెల్లసొనను తల మీద రాసుకొని, కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

మీ ముఖాన్ని అందంగా మార్చడంలోనూ గుడ్డు తోడ్పాటునిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడలో రెండు చుక్కలు నిమ్మరసం కలిపి రాయాలి. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. దీనివల్ల మీ ముఖం సున్నితంగా మారుతుంది.

కోడి గుడ్డులోని పచ్చసొనను తింటే నాడీ సమస్యలు, కాల్షియలోపం సమస్యలు తొలగిపోతాయి. ప్రతి గుడ్డు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలానే హెచ్‌డిఎల్ స్థాయి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ గుడ్డు తినడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. ఆ భావన పూర్తిగా తప్పు. పచ్చసొన గుండెకు మంచిచేసే కొవ్వును ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు.

Disclaimer: ఈ కథనం వైద్యుల సూచనల ఆధారంగా పేర్కొన్న సమాచారం మాత్రమే.

Related News

శ్రమ లేకుండా టిఫిన్ స్నాక్స్ రెడీ.. కరకరలాడే సూపర్ టేస్టీ రవ్వ కట్లెట్ రెసిపీ

పెరుగు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. ఎలా తినాలో చెప్పిన డాక్టర్

బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ కొత్త ట్రెండ్ గురించి తెలిస్తే షాకవుతారు!

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

Big Stories

×