E-Paper
Advertisement

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kasturi Shankar: కస్తూరి శంకర్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

తెలుగు సినిమాలపై కస్తూరి కామెంట్స్..

ఇకపోతే తాజాగా కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు హీరోల గురించి అలాగే తెలుగు సినిమాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కస్తూరి శంకర్ ప్రస్తుతం ధర్మస్థల నియోజకవర్గం (DharmasthalaNiyojakavargam) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి శంకర్ తెలుగు సినిమాల గురించి అలాగే తెలుగు హీరోల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీరోలు దేవుళ్ళుగా కనిపించేవారు..

Advertisement

ఈ సందర్భంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని నేను. ఒకప్పుడు తెలుగు హీరోలు చేసే సినిమాలలో వారిని దేవుళ్ళు లాగా చూపించేవారు. మాయాబజార్, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు వచ్చాయి. వాటిలో హీరోలు అచ్చం దేవుళ్ళులాగే కనిపించేవారు ఆ జనరేషన్ తర్వాత తదుపరి హీరోలు చేసే సినిమాలు సమాజానికి ఒక అర్థవంతమైన మెసేజ్ ఇచ్చే సినిమాలుగా ఉండేవి. న్యాయం కోసం పోరాడే నాయకులు, విప్లవాత్మక సినిమాలు, పోలీసులు లాయర్ల వంటి పాత్రలలో తెలుగు హీరోలు నటించేవారని కస్తూరి శంకర్ తెలిపారు.

దేవుళ్ళ నుంచి స్మగ్లర్స్ వరకూ..

ఇకపోతే ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలన్నింటిలో హీరోలు స్మగ్లర్లు గాను, క్రిమినల్స్ గా మాత్రమే చూపిస్తున్నారని, టాలీవుడ్ సినిమాలు దేవుళ్ళ నుంచి స్మగ్లర్స్ క్రిమినల్స్ వరకు వచ్చాయి. ఇలాంటి సినిమాలు వస్తున్నటువంటి ఈ తరుణంలో మా ధర్మస్థల నియోజకవర్గం సినిమా ఒక సోషల్ మెసేజ్ ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతోంది అంటూ కస్తూరి శంకర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కస్తూరి శంకర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Also Read: అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×