BigTV English

Diabetes Warning Signs: ఉదయం లేవగానే ఇలా అనిపిస్తుందా? అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్టే !

Diabetes Warning Signs: ఉదయం లేవగానే ఇలా అనిపిస్తుందా? అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్టే !

Diabetes Warning Signs: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మధుమేహం సమస్య కూడా ఒకటి. మధుమేహం అంటే సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినా కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఇలా తగ్గడం కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? ఈ పరిస్థితి తలెత్తితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ? వీటి గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మరీ తక్కువ స్థాయికి పడిపోయే స్థితిని హైపోగ్లైసీమియా అని పిలుస్తుంటారు. ఇది తీవ్రమైనప్పుడు స్పృహ కోల్పోవడానికి కారణమవుతుంది. ఇది గుండెపోటు మరణానికి ముప్పులా కూడా తయారవుతుంది. అంతే కాకుండా మధుమేహ చికిత్సలో వాడే కొన్ని మందులు కూడా హైపోగ్లైసీమియాకు దారితీసే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. అదే విధంగా భోజనం మానెయ్యడం, ఉపవాసం, తీవ్రమైన వ్యాయామం, కిడ్నీ వైఫల్యం, వృద్ధాప్యం వంటివి రక్తంలో గ్లూకోజు బాగా పడిపోవడానికి దారితీస్తాయి. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం.

ఉదయం పూట ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం మాత్రమే కాదు రోజులో ఏ సమయంలో కనిపించినా కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే వీటిని హైపోగ్లైసీమియా హెచ్చరిక సంకేతాలుగా చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


  • మార్నింగ్ లేవగానే తీవ్రమైన తలనొప్పి, చెమట.
  • చర్మం పాలిపోవడం.
  • అలసట,నీరసం, తల తిరగడం.
  • ఉదయం నిద్రలేచాక నోరు పొడిబారడం.
  • చూపు మసకబారడం.
  • నాడి వేగంగా కొట్టుకోవడం.
  • తగినంత నిద్రపోయినా కూడా మార్నింగ్ అలసటగా అనిపించడం.
  • విపరీతమైన ఆకలి, దాహం నైట్ టైమ్ కూడా అనిపించడం.
  • గాయాలు త్వరగా మానకపోవడం.

    బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావడం మంచిది. బరువు తగ్గితే మాత్రం వైద్యులను వెంటనే సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. 2019లో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఉదయం లేచినప్పుడు తలనొప్పి, అలసట, చెమట రావడం జరుగుతుంది. షుగర్ స్థాయిలు తక్కువగా ఉండడానికి సంబంధించిన సాధారణ లక్షలు ఇవి. ఇందుకు సంబంధించిన పరిశోధనలో యూకేలోని యూనివర్సిటీ అఫ్ లీడ్స్ డయాబెటిక్ మెడిసిన్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు .రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉందని వారు పేర్కొన్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
భోజనం మానేయడం అస్సలు చేయకూడదు. అలాగే తరచూ గ్లూకోజు మోతాదులు కూడా పరీక్షించుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయినప్పుడు కొందరు స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. అప్పుడు స్పృహ తప్పినవారికి కొందరు నోరు తెరిచి పంచదార పోవడం వంటివి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా ఇది గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
అలాగే స్పృహలో ఉండి మింగ గలిగే స్థితిలో ఉన్న వారికి గూకోజ్ నీరు, చక్కెర కలిపిన కాఫీ, టీ, కూల్‌డ్రింకుల వంటి ద్రవాలు ఇవ్వడం మంచిది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఘనాహారం ఇవ్వకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. హైపోగ్లైసీమియాతో లాలాజలం ఉత్పత్తి తగ్గడం వల్ల నోరు ఎండిపోయినట్లు ఉంటుంది. దీంతో ఆహారం నమిలి మింగడం చాలా కష్టం అవుతుంది నిపుణులు చెబుతున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×