BigTV English

Skin Allergy: స్కిన్ అలెర్జీ ఉన్న వారు.. వీటిని అస్సలు తినకూడదు !

Skin Allergy: స్కిన్ అలెర్జీ ఉన్న వారు.. వీటిని అస్సలు తినకూడదు !

Skin Allergy: చర్మం మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. స్వల్ప నిర్లక్ష్యం కూడా స్కిన్ అలెర్జీలకు కారణమవుతుంది. స్కిన్ అలెర్జీలు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. చర్మంపై అలెర్జీ ఉన్నప్పుడు.. శరీరంలోని వివిధ భాగాలలో దురద, ఎర్రటి దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి.


స్కిన్ అలెర్జీలు కొన్ని రకాల మందులు, ఆహారం, ద్రవ పదార్థాల ఎక్కువగా తీసుకోవడం లేదా చెట్లు, మొక్కలు, జంతువులతో సంబంధం కలిగి ఉండటం వల్ల సంభవిస్తాయి. కానీ చాలా మందికి ఆహార పదార్థాల వల్ల మాత్రమే అలెర్జీ ఉంటుంది. కానీ దీనిని గుర్తించలేరు. అందుకే.. ఈ రోజు మనం స్కిన్ అలర్జీకు కారణం అయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం. వీటిని తింటే స్కిన్ అలెర్జీలు కొత్తగా రావడం లేదా ఇప్పటికే అలాంటి సమస్య ఉన్నవారికి పెరుగుతుంది.

స్కిన్ అలెర్జీకి కారణం అయ్యే ఆహార పదార్థాలు:


డ్రైఫ్రూట్స్:
వేరుశనగ, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ సహజంగా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కూడా అలెర్జీలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే అలెర్జీలలో దురద, దద్దుర్లు, వాపు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటాయి. దీంతో పాటు.. డ్రై ఫ్రూట్ ఆయిల్ వాడటం వల్ల సున్నితమైన వ్యక్తుల శరీరంలో చికాకు కూడా కలుగుతుంది.

గుడ్డు:
గుడ్లు తినడం వల్ల చాలా మందికి అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. గుడ్లు లేదా బేక్ చేసిన వంటకాలు, మయోన్నైస్ లేదా కొన్ని సాస్‌లు వంటి ఆహార పదార్థాలను తినడం వల్ల తక్షణ అలెర్జీ, తామర వస్తాయి. గుడ్ల వల్ల కలిగే చర్మ అలెర్జీ వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఈ సమస్య చాలా కాలం పాటు ఉంటుంది. అందువల్ల, తామర లేదా స్కిన్ అలెర్జీలు ఉన్న వారు గుడ్లు తినకుండా ఉండాలి.

సోయా:
సోయాబీన్ తినడం వల్ల చాలా మందిలో దద్దుర్లు, లేదా తామర వంటి సమస్యలు వస్తాయి. సోయాబీన్‌లో ఉండే ప్రోటీన్ , లెసిథిన్ చర్మ అలెర్జీలను పెంచుతాయి. కాబట్టి.. స్కిన్ అలెర్జీలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

Also Read: టెర్రస్ గార్డెన్‌లో ఈజీగా.. పెరిగే కూరగాయ మొక్కలు ఇవే !

చేప:
ఫిష్ తిన్న తర్వాత చాలా మందికి అలెర్జీ సమస్యలు వస్తాయి. దద్దుర్లు, తామర లేదా తీవ్రమైన అనాఫిలాక్సిస్ వంటి పరిస్థితులను ప్రేరేపించబడతాయి. పీతలు, క్రస్టేసియన్లు, రొయ్యలు, ఎండ్రకాయలు, గుల్లలు , క్లామ్స్ వంటి చేపలను తినడం వల్ల తీవ్రమైన అలెర్జీలు వస్తాయి. ఫిష్ తినడం వల్ల అలెర్జీలు రావడమే కాకుండా.. సున్నితమైన వ్యక్తులు ఫిష్ వండుతున్నప్పుడు వచ్చే ఆవిరిని పీల్చడం ద్వారా లేదా వాటిని తాకడం ద్వారా కూడా అలెర్జీలు రావచ్చు.

పాల ఉత్పత్తులు:
చాలా మందికి పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉంటుంది. ఈ అలెర్జీ ముఖ్యంగా పిల్లలలో సంభవిస్తుంది. పాలు, పెరుగు, జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల తామర వస్తుంది. పాల ఉత్పత్తులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం ద్వారా కూడా అలెర్జీ వస్తుంది. కాబట్టి, వీటిని తినకుండా ఉండటం చాలా మంచిది.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×