E-Paper
Advertisement

పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది.. టీనేజ్ విద్యార్థుల్లో ప్రమాదకర మార్పులు.. కారణాలు ఇవే

పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది.. టీనేజ్ విద్యార్థుల్లో ప్రమాదకర మార్పులు.. కారణాలు ఇవే
Advertisement

Teenagers Losing reading skills| స్మార్ట్‌ఫోన్‌లో సమాచారం క్షణాల్లో దొరుకుతోంది. కానీ ఆ సమాచారాన్ని ఓపికగా చదివి, అర్థం చేసుకుని, నిజానిజాలను పరిశీలించే సామర్థ్యం తగ్గుతోందా? తాజా PISA 2025 ఫలితాలు.. టీనేజర్ల చదివే నైపుణ్యాలపై ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్ల విద్యార్థులపై నిర్వహించిన ఈ అంచనాలో ముఖ్యంగా పఠన సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

PISA అధ్యయనం విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేస్తుంది?

OECD దేశాలు.. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పీసా (Programme for International Student Assessment) అనే అంతర్జాతీయ విద్యా అంచనాను నిర్వహిస్తుంది. ఇది 15 ఏళ్ల విద్యార్థుల చదవడం, గణితం, సైన్స్ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. PISA 2025 ఫలితాల్లో 91 దేశాలు, ఆర్థిక వ్యవస్థలకు చెందిన 7.6 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

OECD దేశాలు ఏవి?

Advertisement

OECD గ్రూప్ దేశాల్లో ఉత్తర, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందిన విభిన్నమైన 38 సభ్య దేశాలు ఉన్నాయి. సభ్య దేశాలతో పాటు, ఈ సంస్థ ప్రధాన అభివృద్ధి చెందుతున్న 5 ఆర్థిక వ్యవస్థలతో కూడా సహకరిస్తుంది. వీటిని కీలక భాగస్వామ్య దేశాలుగా పిలుస్తారు. ఈ దేశాలు బ్రెజిల్, చైనా, భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా.

టీనేజర్ల పఠన స్కోర్లు గణనీయంగా తగ్గిపోయాయి

OECD దేశాల్లో 2015 నుంచి 2025 మధ్య సగటు పఠన స్కోరు 28 పాయింట్లు తగ్గింది. స్కోరు 489 నుంచి 461 పాయింట్లకు పడిపోయింది. మూడు ప్రధాన విషయాల్లో పఠన సామర్థ్యమే ఎక్కువగా తగ్గింది. ఇదే సమయంలో గణిత స్కోరు 22 పాయింట్లు తగ్గింది. 2018 నుంచి 2025 మధ్య పఠన స్కోరు మరో 25 పాయింట్లు పడిపోయింది.

Advertisement

OECD ప్రకారం.. ఈ తగ్గుదల ఒక ఏడాదికి పైగా విద్యాభ్యాసం కోల్పోయినంత ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాథమిక రీడింగ్ స్కిల్స్‌లో కూడా విద్యార్థులు వెనుకబడుతున్నారు. 2015 నుంచి 2025 మధ్య Level 2 కంటే తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ విద్యార్థుల వాటా 10 శాతం పాయింట్లు పెరిగింది. అదే సమయంలో అత్యుత్తమ స్థాయిలో చదివే విద్యార్థుల వాటా రెండు శాతం పాయింట్లు తగ్గింది. ఈ మార్పులు క్లిష్టమైన పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు సూచిస్తున్నాయి.

డిజిటల్ అలవాట్లతో పఠన సామర్థ్యంపై ప్రభావం

పీసా అధ్యయనం.. ఈ తగ్గుదలకు ఒక్క కారణాన్ని మాత్రమే చూపడం లేదు. డిజిటల్ పరికరాల వినియోగం, ఎక్కువ స్క్రీన్ సమయం, వినోదం కోసం చదవడం తగ్గడం వంటి అంశాలు ప్రభావితం చేయవచ్చు. చాలామంది యువత చిన్న పోస్టులు, షార్ట్ వీడియోలు, హెడ్‌లైన్లు, వేగవంతమైన ఆన్‌లైన్ సమాచారానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సమాచారం నిజమైనదా? కాదా? అని కూడా పరిశీలించడం లేదు. దీంతో పొడవైన పాఠాలను ఓపికగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం కష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ పఠన సామర్థ్య తగ్గుదల అనేక దేశాల్లో కరోనా మహమ్మారికి ముందే ప్రారంభమైంది.

లోతుగా చదివి ఆలోచించే సామర్థ్యం ఇప్పుడు మరింత ముఖ్యం

విద్యార్థులు పొడవైన పాఠాలను చదివి సమాచారం విశ్లేషించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే పాఠంలో ఉన్న వివిధ అంశాలను కలిపి అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారుతోంది.
సమాచారాన్ని పరిశీలించడం, ఆధారాలను అంచనా వేయడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కూడా అవసరం.

Also Read: ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు బాగుంటాయి.. నిల్వ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు

“హేస్టీ రీడర్స్” సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం

PISA ఫలితాలు వేగంగా చదివే “హేస్టీ రీడర్స్” సంఖ్య పెరిగినట్లు చూపిస్తున్నాయి. 35 OECD దేశాల్లో 2018 నుంచి 2025 మధ్య ఖచ్చితంగా చదివే విద్యార్థులు ఏడు శాతం పాయింట్లు తగ్గారు.
అదే సమయంలో హేస్టీ రీడర్స్ సంఖ్య 6.6 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది.

Also Read: డీజే సౌండ్‌పై బ్యాన్.. పండుగవేళ పెద్ద సమస్యగా మారుతున్న శబ్ద కాలుష్యం

లోతైన పఠనాన్ని మళ్లీ ప్రోత్సహించడం అవసరం

సమాచారం వేగంగా అందుబాటులో ఉండటం మాత్రమే మంచి పఠన నైపుణ్యాన్ని ఇవ్వదు. యువతకు ఓపిక, ఏకాగ్రత, విమర్శనాత్మక ఆలోచన కూడా అవసరం. పుస్తకాలు చదవడం, పొడవైన కథనాలను చదవడం, డిజిటల్ పరధ్యానాలను తగ్గించడం ఉపయోగపడుతుంది.

PISA ఫలితాలు పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

Tags

Related News

వయసు పెరిగినా అద్భుతమైన జ్ఞాపకశక్తి.. పదునైన మెదడు కోసం పది సూత్రాలు

SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

వెన్నునొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఫిజియోథెరపీ అవసరం

దేవుడిపై బలమైన నమ్మకం.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ

బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా

పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?

Big Stories

Advertisement
×