BigTV English

Teja Sajja: ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత చెర్రీ, తారక్‌లు అలా చేశారు: తేజ సజ్జా

Teja Sajja: ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత చెర్రీ, తారక్‌లు అలా చేశారు: తేజ సజ్జా


Teja Sajja About Global Stars: తేజ సజ్జ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీతో సూపర్ హీరో అయ్యాడు. ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక టీజర్, ట్రైలర్లతో మరింత హైప్ పెరిగింది.

మిరాయ్ ప్రమోషన్స్

త్వరలో థియేటర్లకు వస్తుండటంతో ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అలాగే తేజ సజ్జ వరుస ఇంటర్య్వూలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ మీడియా ఛానల్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు హనుమాన్ రిలీజ్ తర్వాత సినీ ప్రముఖులు ఇచ్చిన ప్రశంసలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశాడు. సందర్భగా తేజ సజ్జ మాట్లాడుతూ.. హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చేశారంటూ ఆసక్తిక సంఘటనను బయటపెట్టాడు. కాగా హనుమాన్ తో ఒక్కసారిగా తేజ సజ్జ స్టార్ హీరో జాబితాలో చేరిపోయాడు. పదకొండు భాషల్లో విడుదలైన ఈ సినిమా అదరగొట్టింది. విజువల్ వండర్ అద్భుతం చేసింది. మైథలాజికల్ డ్రామాకు సూపర్ హీరో జానర్ టచ్ చేసి బిగ్ స్క్రీన్ పై అద్భుతం చేశాడు ప్రశాంత్ వర్మ.


హనుమాన్ చూసి అలా అన్నారు

హనుమాన్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ పేర్లు మారుమ్రోగాయి. ఎంతో సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ పనితానాన్ని అగ్ర దర్శకుడు రాజమౌళి సైతం కొనియాడాడు. ఇక సూపర్ హీరోగా తేజ సజ్జ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత మన గ్లోబల్ స్టార్స్ తనపై ప్రశంసలు కురిపించింది.. పర్సనల్ ఫోన్ చేసి కలిసి మరి తనని అప్రియేషన్స్ ఇచ్చారంటూ తెగ మురిసిపోయాడు. ‘హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అన్న నాకు ఫోన్ చేసి పదిహేను నిమిషాలను మాట్లాడారు. ఆ మూమెంట్ నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది‘ అని మురిసిపోయాడు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రైవేట్ నన్ను పిలిచి డిన్నర్ అరెంజ్ చేశారు. ఆ తర్వాత హనుమాన్ లో నా నటనపై ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా నటించావు.. నీకు చాలా భవిష్యత్తు ఉందంటూ అప్రిషియేషన్స్ ఇచ్చాడు‘ అని తెలిపాడు. ప్రస్తుతం తేజ సజ్జ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మిరాయ్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 12న ఈ చిత్రం దాదాపు పదమూడు భాషల్లో విడుదల కాబోతోంది. మంచు మనోజ్, శ్రియాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వప్రసాద్, క్రతీ ప్రసాద్ లు నిర్మించారు. ఇక హిందీలో ఈ చిత్రం కరణ్ జోహర్ ధర్మప్రొడక్షన్ లో విడుదల అవుతుండటంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

Related News

PM Modi: ఉగ్రవాదంపై మోదీ సంచలన నిర్ణయం.. ఇక మరోసారి అలాచేస్తే దేత్తడే..!

Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు

Vinod Kambli Networth: ఒకప్పుడు కోటీశ్వరుడు.. సచిన్‌తో సమానంగా టాలెంట్.. వినోద్ కాంబ్లి ఆస్తి ఎంతంటే..

Bumrah – Kapil Dev: ఆసీస్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌ !

Bjp leader Madhavi latha: ఎంఐఎం పై మాధవీ లత ఫైర్..బలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు

Big Stories

×