OTT Movie : వైవాహిక జీవితంలో మలయాళం సినిమాలు ఒకప్పుడు పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉండేవి. రొమాంటిక్ సినిమాలే ఎక్కువగా పాపులర్ అయ్యేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు మనం ఆసిఫ్ అలీ నటించిన ఒక రొమాంటిక్ మూవీ ఊరించి తెలుసుకుందాం. ఇందులో భర్త, భార్యతో బలవంతంగా ఆపని చేస్తాడు. ఆ తరువాత స్టోరీ మారిపోతుంది. అతను ఎందుకు అలాచేశాడు ? వీళ్ళ స్టోరీ చివరికి ఏమవుతుంది ? ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్లీవచన్ (ఆసిఫ్ అలీ) ఇడుక్కిలోని ఒక గ్రామంలో ఆర్గానిక్ ఫార్మర్‌గా, తన తల్లి, నలుగురు అక్కలతో జీవిస్తుంటాడు. 35 ఏళ్ల వయసులోనూ, స్త్రీలతో మాట్లాడడానికి సిగ్గుపడే స్లీవచన్, కుటుంబ బాధ్యతలతో పెళ్లి గురించి కూడా ఆలోచించడు. ఒక రోజు తన తల్లి స్పృహ కోల్పోయి పడిపోవడంతో, ఆమెను చూసుకోవడానికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను రిన్సీ (వీనా నందకుమార్) అనే సిటీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ స్త్రీలతో సంబంధాల గురించి అతనికి అవగాహన లేకపోవడం, సె*క్స్ ఎడ్యుకేషన్ గురించి అజ్ఞానం అతన్ని ఇబ్బందిలో పడేస్తాయి. స్నేహితుల సలహాతో ఒక రాత్రి మద్యం సేవించి, రిన్సీపై బలవంతంగా ఆపని చేస్తాడు. దీంతో ఆమె అతన్ని విడిచి వెళ్లిపోతుంది. ఈ ఘటన స్లీవచన్‌ను తన తప్పును గుర్తించేలా చేస్తుంది.
అతను తన వైవాహిక జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు.రిన్సీ తిరిగి రావడానికి స్లీవచన్ తన ప్రవర్తనను మార్చుకోవడం, ఆమె పట్ల ప్రేమ, గౌరవం చూపించడం మొదలుపెడతాడు. అతను తన అజ్ఞానం వల్ల జరిగిన తప్పును అర్థం చేసుకుని, ఆమె హృదయాన్ని గెలుచుకోవడానికి చిన్న చిన్న పనుల ద్వారా ప్రయత్నిస్తాడు. చివర్లో, రిన్సీ స్లీవచన్ హృదయపూర్వక ప్రయత్నాలను చూసి, అతని మార్పుకు తల వంచుతుంది. వీళ్లిద్దరూ తమ వైవాహిక జీవితంలో ముందడుగు వేస్తారు. ఒక ఫీల్-గుడ్ ఎండింగ్‌తో ముగుస్తుంది.
‘Kettyolaanu Ente Malakha’ అనేది నిస్సాం బషీర్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ రొమాంటిక్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ, వీనా నందకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019నవంబర్ 22న విడుదలై, ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.5/10 రేటింగ్ ను సాధించింది.
Read Also : కాబోయే సీఈఓతో హోటల్ రూమ్ లో అలాంటి పనులు… బుర్రపాడు సీన్లు… ఈ డార్క్ కామెడీ క్లైమాక్స్ డోంట్ మిస్